ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు స్మారక సాహిత్య పురస్కారానికి ఆహ్వానం

అభ్యుదయ రచయితల సంఘం, వరంగల్లు శాఖ ప్రతి సంవత్సరం వేరువేరు సాహిత్య ప్రక్రియలకు ఆచార్య వాసిరెడ్డి భాస్కరరావు సాహిత్య పురస్కారం ప్రదానం చేయుట తెలిసినదే.  2014 నుంచి  ఈ అవార్డును అందచేస్తున్నారు.  2021 సంవత్సరంనకు గాను విమర్శ ప్రక్రియకు ఇవ్వడానికి నిర్ణయించనైనది. కావున తెలుగు సాహిత్య విమర్శనా గ్రంథాలను పోటీ కి ఆహ్వానిస్తున్నాం. విమర్శ గ్రంథాలు జూలై 2017 నుండి జూన్ 2021 మధ్యలో ముద్రణ పొంది ఉండాలి.
*ప్రథమ ముద్రణ లు మాత్రమే పంపాలి.
*వేరువేరు రచయితల వ్యాసాల సంకలనాలు పంపరాదు.
*రచయితలు యే ప్రాంతం వారైనా పంపవచ్చు.
*తప్పని సరిగా మూడు ప్రతులు పంపాలి.
*తెలుగు సాహిత్య విమర్శనా గ్రంథాలు అందవలసిన చివరి తేదీ 30/09/2021 .
*పంపవలసిన చిరునామా;
బూర భిక్షపతి
ఇం. నెం.2 – 12 – 293/20
విజయ నగర్ కాలనీ
గోపాల్ పూర్ రోడ్డు
హన్మకొండ 506009
ఎంపికైన విమర్శ గ్రంథకర్త కు రూ5000/- నగదు, శాలువా, మెమెంటో లను నవంబర్ లో జరుగు ప్రత్యేక కార్యక్రమంలో హన్మకొండ నందు అందజేయబడునని అ.ర.సం. వరంగల్లు శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నిధి, డా. పల్లేరు వీరాస్వామి తెలిపారు. వివరాలకు చరవాణి నం. 9701000306 , 9441602605,9866612717లలో సంప్రదించగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *