జగన్ జనాదరణ తగ్గుతూ ఉంది : ఇండియా టుడే పోల్

ప్రధాని నరేంద్రమోదీ జనాదరణ బాగా  పడిపోయింది. బాగా  అంటే మరీ దారుణంగా పడిపోయింది. గత ఏడాది వరకు వచ్చే ప్రధాని ఎవరూ అంటే  ఎక్కువ మంది మోదీ వైపే వేలు చూపే వారు.  అపుడు సర్వేల్లో 66 శాతం మంది దాకా మోదీకే మద్దుతునిచ్చారు. ఇపుడిది 24 శాతానికి పడిపోయింది. ఇండియా టుడే గ్రూప్ ప్రతి ఏడాది మూడ్ ఆఫ్ ది నేషన్ (Mood of the Nation) పేరుతో ప్రధాని జనాదరణ ఎంత ఉంది, రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి జనాదరణ ఎలా ఉందని విషయం మీద పోల్ నిర్వహిస్తూ ఉంటుంది. ఈ ఏడాది నిర్వహించిన ఫోల్ ఫలితాలను ఇపుడు విడుదల చేశారు.

credit: PIB

ఇండియా టుడే గ్రూప్ నిజాయితీని శంకింనవసరం లేదు. ఈ గ్రూప్ నిర్వహించే ఈ సర్వేలకు మంచి పేరుంది. అందుకే బిజెపిమొదలుకుని, తెలుగు రాష్ట్రాలలోని రూలింగ్ పార్టీల దాకా ఈ గ్రూప్  సర్వే ఫలితాలు రాగానే విపరీతంగా ప్రచారం చేసుకున్న సంగతి అందరికి గుర్తుండే ఉంటుంది. ఇలాంటి గ్రూప్ ఒపినియన్ పోల్ ఈ సారి  చాలా మంది షాకిచ్చేలా ఉంది. సర్వే అధారంగా ట్రెండ్స్ మీద జర్నలిస్టు శివమ్ విజ్ అనేక ట్వీట్స్ విడుదల చేసి  సర్వే ఫలితాలకు సూక్ష్మీకరించారు.

 

కోవిడ్ పాండెమిక్  ప్రధాని నరేంద్ మోదీ ప్రభని బాగా మసకబార్చింది. కోవిడ్ విషయంలో కేంద్రం ప్రభుత్వం ఎలా విఫలమయిందో అందరికి తెలిసిందే. దేశ వ్యాపితంగాలాక్ ప్రకటించడం, వసల కార్మికుల హాహాకారాలు మొదలుకుని  వ్యాక్సిన్ మీద చేసిన ప్రకటనలు, ఆపైన వ్యాక్సిన్ కొరత దాకా కేంద్రం చాలా సార్లు తప్పుటడుగులు వేసింది. ఇదంతా మోదీ అకౌంట్ లో పడిపోయింది. కేంద్రంలో ప్రధాని మోదీ తప్ప మరొకరెవరూ లేరని, ఉన్నా లెక్కలోకి రారనే విధంగా ఏవిధంగా మోదీని ఆకాశానికెత్తారు. అందుకే కోవిడ్ వైఫల్యమంతా ప్రధాని అకౌంట్ లోనే పడిపోయింది. ఆయన జనాదరణ ఘోరంగా పతనమయ్యేలా చేసింది. గతంలో 66శాతం ఉన్న ఆయన జనాదరణ ఇపుడు 24 శాతానికి పడిపోయింది.

ఇక ప్రధానికి పదవికి మోదీ తర్వాత ప్రధాని అభ్యర్థిగా పేరు పొందిన ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ని ప్రజలు అదరించడం లేదు.

వచ్చే ప్రధాని ఎవరని అడిగినపుడు ఆయనకు ఓటేసిన వారు కేవలం 11 శాతమే. వచ్చే ప్రధానిగా రాహుల్ గాంధీకి ఓటేసిన వారు కేవలం 10 శాతమే.అయితే, ఆదిత్యనాథ్, రాహుల్ గాంధీ గత సారి కంటే 3 శాతం మెరుగుపడటం సర్వేలో కనిపించింది.

ఇక ముఖ్యమంత్రుల పనితీరులో తమిళనాడు ముఖ్యమంత్రి  స్టాలిన్ నెంబర్ వన్. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ కు  ఏడో ర్యాంకు లభించింది. ఎక్కువ ప్రచార పటాటోపం లేని  తమిళనాడు  ముఖ్యమంత్రి స్టాలిన్ గుమ్మున మంచి  మార్కులు కొట్టేశారు. అయనకు 42 శాతం మార్కులు పడ్డాయి.

ఆపైన ఒదిషా చీఫ్ మినిస్టర్ నవీన్ పట్నాయక్ ,కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్,  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దావ్ థాకరే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, అస్సాం సిఎం హిమంతా బిశ్వాస్ ఉన్నారు. టాప్ టెన్ ముఖ్యమంత్రులలో సీటు దొరికిన బిజెపి ముఖ్యమంత్రులు ఇద్దరే. వారు, ఆదిత్యనాథ్, హిమంత్.  2022 లో అసెంబ్లీ ఎన్నికల ముందు ఉత్తర ప్రదేశ్ లో కేవలం 29 శాతం  మంది మాత్రమే యోగిని తదుపరి ముఖ్యమంత్రి గా సమర్థించడం విశేషం.

 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టాప్ టెన్ లో లేరు. ఆయన పదకొండోస్థానంలోకి జారుకున్నారు. ఆయనకు వచ్చిన జనాదరణ రేటింగ్ 19 శాతమే. బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఎవరన్నపుడు జగన్ కు పడిన మార్కులు ఆరు శాతమే. ఇదే గత ఏడాది సర్వేలో 11 శాతంగా ఉండింది. మొత్తానికి ఆయన ప్రజాదరణకూడా మసకబారుతూ ఉన్నట్లు ఇండియా టుడే ఫోల్ వెల్లడించింది. టాప్ టెన్ తెలుగు ముఖ్యమంత్రులిద్దరు పేర్లే లేవు.

తమాషా ఏమిటంటే ఏ ముఖ్యమంత్రికి 50 శాతం మార్కులు రాలేదు. కాబట్టి ఎవరూ సర్వే మీద నొచ్చుకోవసరం లేదు. ఏ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రుల తీరుతొ సగం మంది కూడా హ్యాపీ గా లేరని పోల్ వెల్లడించింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *