అమరావతి రాజధాని పరిరక్షణ ఉద్యమానిదే అంత్యమ విజయం. అమరావతి రాజధాని విధ్వంసానికి పాల్పడ్డ ప్రభుత్వానికి భంగపాటు తథ్యం.
ఈ రోజు మందడం దీక్షా శిబిరంలో “న్యాయ దేవత” విగ్రహాన్ని మాజీ మంత్రివర్యులు శ్రీ వడ్డే శోభనాద్రీశ్వరరావు గారు ఆవిష్కరించారు. నాతో పాటు శ్రీయుతులు వెలగపూడి గోపాలకృష్ణ, పోతుల బాలకోటయ్య, జేఏసీ ఛేర్మన్ శివారెడ్డి, యుగంధర్, పువాడ సుధాకర్, న్యాయవాదులు లక్ష్మీనారాయణ, రఘునాథ్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
అమరావతి నుండి రాజధానిని విశాఖకు తరలింపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేసిన చట్టం అత్యంత లోపభూయిష్టమైనది. న్యాయ సమీక్షలో కాలగర్భంలో కలిసిపోతుందన్న బలమైన విశ్వాసం ఉద్యమకారుల్లో ఉన్నది. రైతులు, మహిళలు, బడుగు బలహీన వర్గాలు 609 రోజులుగా సాగిస్తున్న ప్రజా ఉద్యమానిదే అంతిమ విజయం.
-టి. లక్ష్మీనారాయ, కన్వీనర్
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక