ఎపి విద్యార్థులకు జగన్ Best Wishes

తూర్పుగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా పి. గన్నవరం చేరుకున్నారు. పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోని గ్రీన్‌ బోర్డుపై ‘ఆల్‌ ది బె​స్ట్‌’ అని రాసి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరికొద్దసేపట్లో ‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత పనులు పూర్తైన పాఠశాలలను సీఎం జగన్‌ ప్రారంభించనున్నారు.

‘మనబడి నాడు-నేడు’ ద్వారా తొలి విడత కింద రూ.3,669 కోట్లతో సర్వాంగ సుందరంగా 15,715 ప్రభుత్వ స్కూళ్లను ఆధునీకరించారు. నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న సందర్భంగా వైఎస్‌ జగన్‌ వాటిని విద్యార్థులకు అంకితం చేయనున్నారు. అనంతరం రెండో విడత చేపట్టబోయే పాఠశాలల పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుడతారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని రూ.731.30 కోట్లతో ప్రారంభిస్తారు. 8 పాఠశాల వద్ద ఉన్న భవిత కేంద్రం, గ్రంథాలయం, లేబొరేటరీలు పరిశీలించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు స్టాళ్లను సీఎం జగన్‌ సందర్శిస్తారు. విద్యార్థుల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ను ప్రారంభిస్తారు. టాయిలెట్లను పరిశీలిస్తారు. అనంతరం నాడు-నేడు పైలాన్‌ను ఆవిష్కరించి, పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *