హుజురాబాద్ లో ఎం జరుగుతోంది?
ఈ నెల 16న కేసీఆర్ పర్యటనకు జనసమీకరణ బాధ్యత టీచర్లకు అప్పగించారు.దళిత బంధు పథకం అమలు పేరుతో ముఖ్యమంత్రి కార్యక్రమము ఏర్పాటు చే స్తున్నారు. ఇదంతా ఎన్నికల కోసమే నని వేరే చెప్పాల్సిన పని లేదు. హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు ఇంతగా చెమటోడ్చడం గతం లో ఎక్కడ జరిగి ఉండదు .
ఇవిగో కరీంనగర్ జిల్లా విద్యాధికారి ఉత్తర్వులు.
హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నది టీఆరెఏస్ కాదేమో, నేరుగా ప్రభుత్వమే అభ్యర్థిని నిలబెడుతున్నదేమో అనే అనుమానమ్ వస్తుంది, అక్కడ జరుగుతున్న హంగామా చూస్తే.
సీఎం సభకు జన సమీకరణ బాధ్యత టీచెర్లకు అప్పగించడం ఏమిటి? డబ్బులు పంచే దళిత బంధు కు లబ్ది దారులు పరిగెత్తుకుంటూ రావాలిగా? మరి టీచర్లు ఎందుకు?