మానవ హక్కుల నేత జయశ్రీ సంస్మరణ సభ

మానవ హక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, కడప జిలా కన్వీనర్ శ్రీమతి కె. జయశ్రీ గతనెల 31వ తేదీ హఠాత్తుగా మనందరినీ వదలి వెళ్లిపోయారు.మానవ హక్కుల పరిరక్షణకు, హక్కులు ఉల్లంఘించిన వారికి, వారి భాద్యతలు గుర్తు చేయడానికి జయశ్రీ గత 30 సంవత్సరాలుగా కడపతో పాటు రాయలసీమ జిల్లాలలో విశేషంగా కృషి చేసారు.

ప్రొద్దుటూరు పట్టణంలో పేరుపొందిన వ్యాపారి బంగారయ్య కుటుంబంలో జన్మించిన ఆమె చిన్న వయసులోసామాజిక కట్టుబాట్లు తెంచుకుని మతాంతర వివాహం చేసుకొన్నారు.

తన జీవితాన్ని కుటుంబ సంరక్షణకు, సామాజిక రుగ్మతలపై పోరాడటానికే అంకితం చేశారు. జిల్లాలో సాధారణ ప్రజలకు, మహిళలకు, కొన్ని సందర్భాలలో పేరు పొందిన నాయకులకు కూడా అండగా నిలిచారు. తమ సమస్యకు జయశ్రీ మాత్రమే పరిష్కారం చూపగలదనే నమ్మకాన్ని ఆమె ప్రజలలో కల్పించారు. అలాంటి ధీరోదాత్త మహిళా నాయకురాలు హఠాత్తుగా మరణించి అందరినీ శోకంలో ముంచారు.

ఆమె మరణం ప్రజలకు తీరని నష్టం. అందువల్ల ఆమె స్మృతులను గుర్తు చేసుకోడానికి, ఆమెను సంస్మరించడానికి ఈనెల 15వ తేదీన కడప ప్రెస్ క్లబ్ లో సమావేశం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల వేదిక ఉభయ రాష్ట్రాల కన్వీనర్ కృష్ణా, రాష్ట్ర అధ్యక్షరాలు సుధ, వసంతలక్ష్మి, మహిళానాయకురాలు సంధ్య, ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనాధ రెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు సి.హెచ్ చంద్రశేఖర్ రెడ్డి, విరసం నాయకురాలు వరలక్ష్మి, సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య, సిపిఐఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొంటారు.
మిత్రులంతా సభలో పాల్గొనాలని కోరుతున్నాము.

తేదీ’15/8/2021
వేదిక: కడప ప్రెస్ క్లబ్, కడప
సమయం:ఉదయం 10 గంటలనుండి

ఆహ్వానించువారు:
మానవ హక్కుల వేదిక మరియు జయశ్రీ మిత్ర బృందం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *