శ్రీశైలం ప్రాజెక్ట్, కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరిగింది. ఈ సీజన్లో రెండవసారి. రిజర్వాయర్ లోకి వరద ప్రవాహం భారీగా ఉండటంతో 1క్రస్ట్ గేట్ పది అడుగుల మేరకు ఎత్తి దిగువకు 27,983 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. పస్తుతం ఇన్ ఫ్లో;1,46,936 క్యూసెక్కులుంది. రిజర్వాయర్ పూర్తి స్దాయి నీటి మట్టం (FRL) 885 అడుగులు, ప్రస్తుతం : 884.80 అడుగులకు చేరింది.
పూర్తిస్థాయి నీటి నిల్వ : 215.8070 టీఎంసీలు. ప్రస్తుతం : 214.8450 టీఎంసీలు నీరుంది. కుడి గట్టు,ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాల ద్వారా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.