నాసా చేతికి చిక్కని అంగారకుడి రాళ్లు

మెల్లిగా, అంగారకుడి (Mars) ఉపరితలం మీద ఒక రంద్రం వేసి, భూగర్భంలో నుంచి కొన్ని రాతి నమూనాలను లాక్కుని రావాలనుకున్న నాసా పర్సివరెన్స్ రోవర్ తొలి ప్రయత్నం ఫెయిలయింది. అంగారకుడి రాయి పర్సివరెన్స్ రోబోటిక్ చెేతికి అందలేదు.  అంతుబట్టని అనేక అంగారక రహస్యాలను కనుగొనేందుకు పనికొచ్చే ఈ శాంపిల్స్ కోసం నాసాలోనే కాదు, ప్రపంచమంతా వేలాది మంది  శాస్త్రవేత్తలు ఎదురుచూస్తున్నారు .వారంతా నిన్న అవాక్కయ్యారు. ఏమయింది, ఎందికిలా జరిగిందని తలబాదుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే…

ఈ ఏడాది ఫిబ్రవరిలో నాసా అంగారకుడి మీదికి పర్సివరెన్స్ అనే వాహనాన్ని పంపింది. ఇది అనుకున్నట్లే అక్కడి జెజీరో అనేక ఒక పెద్ద గోతిలో దిగింది. ఇది అక్కడ రెండు పనులు చేయాల్సి ఉంది: 1.అక్కడేమయినా ప్రాణి ఆనవాళ్లు  ఉన్నాయోమో నని వెదకడం, 2. అక్కడి నుంచి రాతి నమూనాలను పట్టుకు రావడం. నాసా రోవర్ ఒక కారుసైజున్న వాహనం. పర్సివెరెన్స్ ను ముద్దుగా పెర్సీ అని పిలుస్తారు.

నిన్న నాసా రోవర్ చెప్పినట్లే చేసింది.  అంగారకుడిమీద ఒక రంధ్రం వేసింది.  అందులో ఉండే రాళ్లను పగలగొట్టి ముక్కలను, రాతి పొడిని టైటానియం ట్యూబుల్లో నింపి, చక్కగా సీల్ చేసి, జాగ్రత్త గా భూమికి తీసుకురావాలి. ఇవన్నీ 2031లో  భూమికి వస్తామి.  అంగారకుడి మీద ఒక రంధ్రం డ్రిల్ చేయడం అయిపోయింది. కాబట్టి రాతి శాంపిల్స్ సేకరించడం ఆశించినట్లు జరుగి ఉంటుందని అంతా భావించారు. ఎందుకంటే శాంపిల్స్ కలెక్షన్  ప్రాసెస్ కూడా పూర్తయింది. నాసాలో కొంత మంది శాస్త్రవేత్తలు అపుడే సెలెబ్రేట్  చేసుకున్నారు కూడా.

తీరా దీనికి సంబంధించి పర్సివరెన్స్ పంపిన ఫోటోలను, డేటాను జాగ్రత్త గా చూస్తే రోబోటిక్ చేతికి   అంగారకుడి రాళ్లు అందలేదని స్పష్టమయింది. ట్యూబుల్లోకి శాంపిల్స్ ను నింపినా అందులో ఏమీలేదు. ఉత్తిదే. రాతి పొరలకు రంధ్రం వేసిన రోబోటిక్ చేతికి రాతి ముక్కలు, పొడి చిక్కలేదు. ఎందుకు చిక్కలేదో శాస్త్రవేత్తలకు అంతుబట్టడంలేదు. అంగారక రాయి చిత్రంగా ప్రవర్తించిందని వాళ్లు భావిస్తున్నారు.

అంగారకుడి శాంపిల్స్ భూమ్మీదికి తేవడం (Mars Sample Return Mission)అనేది ఒక మానవజాతికి మరొక ఘనవిజయం అవుతుంది. భూమికి బయట మరొక గ్రహం నుంచి మనిషి సేకరించిన తెచ్చిన తొలి నమూనా ఇది అవుతుంది.

అంగారకుడి గురించి మనిషికి ఉన్న అవగాహనను పూర్తి విప్లవీకరించే ప్రయోగం ఇదవుతుంది. కాని ఈ ప్రయోగం తొలిమెట్టులో అంగారకుడు అందరిని ఆశ్చర్యపరిచాడు.

అంగారకుడి నుంచి మొత్తం 43 శాంపిల్స్ భూమికి అందాల్సి ఉంది. వీటిలో ప్రాణి ఉనికి గాని, ఆనవాళ్లు గాని ఉన్నాయోమో చూసేందుకు ప్రపంచంలోని అనేక లాబొరేటరీలు ప్రయోగాలు చేసేందుకు సిద్దమయ్యాయి.

అయితే, తదుపరి ప్రయత్నాలు విజయవంతమవుతాయని శాస్తవేత్తలు ధీమాగా ఉన్నారు. ఇంతవరకు పెర్సీ అక్కడ కుదటపేడేందుకు బిజీ గా ఉండింది. పెర్సీ గొప్పతనమేంటంటే, భూమ్మీది శాస్త్రవేత్తలతో సంబంధం లేకుండా అపుడపుడూ తనే అంగారకుడి మీద అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అక్కడి రాళ్లు రప్పల మీదికి లేజర్ బీమ్స్ పంపించి ఏమవుతుందో గమనిస్తూ ఉంటుంది.తన అంగారక ట్రెకింగ్ మీద  ఇప్పటి దాకా లక్ష వరకు ఫోటోలను పంపింది. తన పరిసరాలను మ్యాపులను తయారుచేసి పంపింది. అక్కడి కార్బన్ డయాక్స్ డ్ వాతావనరణం నుంచి ఆక్సిజన్ తయారుచేసేందుకు ప్రయత్నాలు చేసింది. ఇదంతా కూడా అంగారకుడి రాళ్లురప్పలను పరిశీలించి అక్కడేమయిన ప్రాణిజీవించి ఉండిందా అని కనుక్కునేందుకే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *