కృష్ణా ఫ్లాష్ ఫ్లడ్ అలెర్ట్

*Flash Floods Alert

ఆకస్మిక వరద ప్రమాదం ఉన్నందున  కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని కృష్ణా కలెక్టర్ జె నివాస్ హెచ్చరించారు.

వివరాలు:

పులిచింతల డ్యాం 16 వ గేట్ సాంకేతిక సమస్య తో ఊడిపోయింది. దీని స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారు.

ఇందుకు డ్యాం లో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోంది. లేని ఎడల ఆ నీటి వత్తిడి ఇతర గేట్ల పై పడే అవకాశం ఉంది.

ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ చేరనున్నది

ఈ దృష్ట్యా అధికారులు, నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలి.

పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ఉండగా,ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులు

ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉంది.

వాగులు,వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *