తెలంగాణ నిరుద్యోగుల కోసం వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల ప్రతి మంగళ వారం దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.
రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడ నియోజకవర్గం, కోనరావుపేట మండలం, గొల్లపల్లె గ్రామంలో ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న మహేందర్ యాదవ్ కుటుంబాన్ని పరామర్శించి, అదే గ్రామంలో షర్మిల ఒక రోజు “నిరుద్యోగ నిరాహార దీక్ష“ చేపట్టారు.
మెల్లిమెల్లిగా ఆమె ముఖ్యమంత్రి కెసిఆర్ మీద, ఆయన కుమారుడు మంత్రి కెటిఆర్ మీద దాడి పెంచుతున్నారు. ఈ రోజు, బయట ఎవరికీ ఉద్యోగాల్లేవు, ముఖ్యమంత్రి ఇంటినిండా ఉద్యోగాలే అన్నారు. కెసిఆర్ పాలనని, తండ్రి వైఎస్ ఆర్ పాలనని పోల్చి చెబుతూ వైఎస్ ఆర్ కేవలం అయిదేండ్లే పదవిలో ఉన్నా మూడు సార్లు ప్రభుత్వోద్యోగాలకు రిక్రూట్ మెంట్ జరిపి లక్షలాది మంది నిరుద్యోగులకు ఉపాధి చూపించారు. ఇపుడు ఎవ్వరికీ ఉద్యోగాలు రావడంలేదని అన్నారు. ఎంతవరకు ఆమె తెలంగాణ నిరుద్యోగులను ఆకట్టుకుంటారో తెలియదు గాని, ఆమె స్పష్టం నిరుద్యోగుల పక్షం తీసుకున్నారు. తనతండ్రి తీసుకువచ్చిన పథకాలను తెలంగాణలో నిర్వీర్యం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతేకాద, అట్టహాసంగా పథకాలు ప్రటించి ఇప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి వాటిలో ప్రతియేటా కోత విధిస్తున్నారని కూడా ఆమె విమర్శించారుు. ఈ రోజు ఆమె దీక్ష ఫోటోలు ఇవి: