కార్మికోద్యమ నేత వి. వి. రామారావుకు నివాళి

 

కార్మికోద్యమానికి అంకితమైన జీవితం కామ్రేడ్ వి. వి. రామారావు గారిది.

ఎఐటియుసి జాతీయ ఉపాధ్యక్షులు, ఆల్ ఇండియా పోర్ట్ అండ్ డాక్ వర్కర్స్ ఫెడరేషన్, ప్రధాన కార్యదర్శి, విశాఖపట్నం హార్బర్ అండ్ పోర్ట్ వర్కర్స్ యూనియన్ అగ్రనాయకుడుగా ఉద్యమ నిర్మాణంలో ముఖ్యమైన భూమిక పోషించిన, సిపిఐ సీనియర్ నాయకులు కామ్రేడ్ వి. వి. రామారావు(74) గారు దీర్ఘకాలికంగా అనారోగ్యంతో విశాఖపట్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు(ఆదివారం) ఉదయం 8-30 గం. ల సమయంలో మరణించారని తెలియజేయడానికి చింతిస్తున్నాము.

ప్రభుత్వ రంగ సంస్థలకు, ఆధునిక పరిశ్రమలకు, సంఘటిత కార్మిక వర్గానికి, బలమైన కార్మికోద్యమానికి విశాఖ కేంద్ర స్థానం. విశాఖ పోర్టులో, వైజాక్ స్టీల్ ప్లాంట్ లో ఎఐటియుసి తిరుగులేని సంస్థగా ఉన్నది. పోర్ట్ యూనియన్ను తిరుగులేని శక్తివంతమైన సంస్థగా నిర్మించడంలో కా.వి.వి.రామారావు గారు పోషించిన పాత్ర అనితరసాధ్యమైనది.

పోర్ట్ ట్రస్ట్ బోర్డులో 1984 నుండి 25 సంవత్సరాలకు పైబడి కార్మిక ప్రతినిధిగా ప్రాతినిథ్యం వహించారు. విశాఖ రేపు చరిత్రలో ఇంతకాలంపాటు ఆ పదవిలో కొనసాగిన అరుదైన గౌరవం కా.వి.వి.రామారావు గారికే దక్కింది. ముప్పై ఏళ్ళకుపైగా డాక్ లేబర్ బోర్డు సభ్యులుగా కొనసాగారు.

విశాఖ పోర్ట్ & డాక్ వర్కర్స్ యూనియన్ అగ్రనాయకుడుగా ఓడరేవు కార్మికులకే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోను, నేటి ఆంధ్రప్రదేశ్ లోను, జాతీయ స్థాయిలో ఓడరేవు కార్మికుల అభ్యున్నతికి విశేషకృషి చేసిన ధన్యజీవి. కా. వి. వి. రామారావు గారి మరణం కార్మిక వర్గానికి పూడ్చలేని లోటు. కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని కొరత. కామ్రేడ్ వి. వి. రామారావు గారికి విప్లవ జోహార్లర్పిస్తున్నా!

(టి. లక్ష్మీనారాయణ,
రాష్ట్ర విశ్రాంత కార్యనిర్వాహక అధ్యక్షులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఏ. ఐ. టి. యు. సి.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *