ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద పక్క రాష్ట్రం కేసు బుక్ చేయడం ఎపుడయినా విన్నారా? కావేరీ నీళ్లు భీకరంగా తమిళనాడు, కర్నాటక తలపడ్డాయి. అంధ్రావాళ్లు, తెలంగాణ వాళ్లు ప్రాజక్టుల దగ్గిర గొడవపడ్డారు. అయితే, ఎపుడూ ముఖ్యమంత్రుల మీద కేసులు పెట్టుకోలేదు.
అయితే, మిజోరాం ఇలా పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి మీద ఇలాంటి మెతక వైఖరి తీసుకోదలచుకోలేదు. ఎకంగా అస్పామ్ ముఖ్యమంత్రి హిమంతా బిశ్వశర్మ మీద కేసు పెట్టింది.
ఈ రెండు రాష్ట్రాల సరిహద్దు వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వివాదం ఈ మధ్య జూలై 26న సరిహద్దుల్లో కాల్పులు జరిగాయి. అస్సాం కొచార్ జిల్లాకు, మిజోరాం కోలాసిబ్ జిల్లాలో సరిహద్దు వివాదాలున్నాయి. ఈ కాల్పుల్లో అస్సాం కు చెందిన ఆరుగురు జవాన్లు మరణించారు.
ఈ గొడవలకు కారణమ అస్సామే నని చెబుతూ అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తోపాటు నలుగురు సీనియర్ పోలీసు అధికారుల మీద హత్యాయత్నం తోపాటు ఇతర సెక్షన్ల మీద కేసులు పెట్టారు. మిజోరాం కోలాసబ్ జిల్లాలోని వైరెంగ్టే పోలీసు స్టేషన్లో కేసులు ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. రెండు రాష్ట్రాల సాయుధ దళాల మధ్య కాల్పులు జరిగింది కూడా ఈ పోలీస్ స్టేషన్ పరిధిలోనే.
ఎఫ్ ఐ ఆర్ నమోదయిన నలుగురు సీనియర్ అధికారులు అస్సాం ఐజి అనురాగ్ అగర్వాల్, కచార్ డిఐజి దేవొజ్యోతి ముఖర్జీ, కచార్ ఎస్ పి చంద్రకాంత్ నంబాల్కర్, ధోలాయ్ పోలీస్ స్టేషన్ ఇన్ చార్జ్ సాహబ్ ఉద్దీన్. వీళ్లందరిని ఆదివారం నాడు విచారణకు పోలీస్ స్టేషన్ కు రావాలని సమ్మన్లు జారీ చేశారు.