గుంతకల్ పట్టణంలో ఈరోజు (28/7/2021) సిపిఐ (ఎంఎల్ ) న్యూడెమోక్రసీ పార్టీ అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి, రెండు నిమిషాలు మౌనం పాటించి, ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా సిపిఐ (ఎంఎల్ )న్యూడెమోక్రసీ పార్టీ గుంతకల్ డివిజన్ కార్యదర్శి బి, సురేష్ వహించినారు.
జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి సింగనమల నియోజకవర్గం తరిమెల గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో జన్మించారని ఆయన విద్యార్థి దశ నుండే కమ్యూనిస్టు భావాలను అలవర్చుకున్నారని చెప్పారు. ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా ఓ సారి పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ వీటిని వ్యతిరేకించి శాసన సభకు రాజీనామా చేసి విప్లవోద్యమంలో పని చేసినారు.
ప్రభుత్వం సికింద్రాబాద్ కుట్ర కేసును బనాయించి ఆయనను అరెస్టు చేసినప్పుడు కోర్టులో మాట్లాడుతూ విప్లవకారుల చర్యలను ,ఆచరణను వివరిస్తూ మాట్లాడారు. అదే 700 పేజీలలో తాకట్టులో భారతదేశం గ్రంథం గా ప్రసిద్ధి చెందినది. ఆ రోజు చెప్పిన విషయాలే నేడు వాస్తవ రూపం ఉన్నాయ్ అని తెలిపినారు. ఆయన రహస్య జీవితం లో ఉంటూ జూలై 28 వ తారీకు 1976 సంవత్సరంలో మరణించినారు .
దేశంలో విప్లవ ఉద్యమాన్ని అణచివేయడానికి పాలకవర్గాలు నిరంతరం ప్రయత్నిస్తూ బూటకపు ఎన్ కౌంటర్ లతో ఉద్యమకారుల్ని వేలాది మందిని హత్య లు చేసినారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నేడు ప్రజా, కార్మిక , రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ వీటిని వ్యతిరేకిస్తున్నా వారిని అణచి వేయడానికి నల్ల చట్టాలను తీసుకొచ్చి మేధావులను , జర్నలిస్టులను , ప్రజాస్వామిక వాదులను అక్రమ అరెస్టులు చేసి జైల్లో బంధించడం జరుగుతున్నది. భీమా కోరేగావ్ కేసు కింద వరవరరావు అంబేద్కర్ మనవడు ఆనంద్ తే ల్ తుంబె , గౌతమ్ నవలా ఖాన్, ప్రొఫెసర్ సాయిబాబా, ఫాదర్ స్టాన్ స్వామి మొత్తం 16 మందిని ఉపా చట్టం కింద అరెస్టు చేయడం జరిగినది. వీరిలో జుడిషియల్ కస్టడీలోనే ఉంటూ స్టాన్ స్వామి మరణించడం జరిగినది.
ఈ మరణానికి కేంద్ర ప్రభుత్వ మే బాధ్యత వహించాలని తెలపడం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ తన ఏడు సంవత్సరాల పరిపాలనలో దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టానారు. 500 ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేట్ పరం చేస్తుండడంతో టెలికాం, రైల్వే ,పౌర విమాన రంగం, బ్యాంకింగ్, ఇస్రో, రక్షణ, బొగ్గు ,ఆయిల్ కంపెనీలు లోని ప్రభుత్వ పెట్టుబడులు ఉపసంహరించుకుంటు ప్రైవేటు పరం చేస్తుండటంతో కోట్ల మంది ఉద్యోగస్తులు వీధిన పడే పరిస్థితి ఏర్పడింది. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కోడ్ ల ను తీసుకొని వచ్చి, కార్మిక హక్కులను నిర్వీర్యం చేస్తున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను , విద్యుత్ బిల్లును వీటిని లక్షలాది మంది రైతులు వ్యతిరేకిస్తున్నా మోడీ ప్రభుత్వం మొండిగా, దుర్మార్గంగా కార్పొరేట్ కంపెనీలకు, బహుళ జాతి కంపెనీలకు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉండడంతో వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభం ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కరోనా వైరస్ ను ఎదురుగానే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందినది, దేశంలో కనీస వైద్య సదుపాయాలు లేకపోవడంతో కరోనా వైరస్ కారణంగా లక్షలాది మంది ప్రజలు మరణించడం జరిగింది. ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు పోరాటం లోకి భాగస్వాములు అయినప్పుడే కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి గారికి నిజమైన నివాళులర్పించిన వారము అవుతామని తెలిపినారు.
ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి, నాగరాజు జిల్లా కమిటీ సభ్యుడు పెద్దన్న , పట్టణ పేదల సంఘం కార్యదర్శి ,చిన్నా, గోపాల్ , ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి , ఏసురత్నం, జిల్లా కమిటీ సభ్యులు, శ్రీ రాములు, హనుమంతు ,మోహన్ నాయక్, రామంజి, ప్రగతిశీల మహిళా సంఘం, ఆశా బి, ప్రగతిశీల విద్యార్థి సంఘం (పి డి ఎస్ యు) రంగస్వామి, ఐ.ఎఫ్.టి.యు కమిటీ సభ్యులు, రామాంజనేయులు , జిలాన్ ,సత్తార్ ,రఘు ,గంగాధర్, నారాయణ,ర మణారెడ్డి ,భాష తదితరులు పాల్గొన్నారు.
-బి , సురేష్
గుంతకల్ డివిజన్ కార్యదర్శి
సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ