ఈ రోజు ఇన్ కమ్ టాక్స్ డే… దీని చరిత్రేంటో తెలుసా?

భారతదేశంలో ఈ రోజు  ఇన్ కమ్ టాక్స్ డే జరుపుకుంటారు.  ఇది 160 వ దినోత్సం. అంటే భారత దేశంలో ఇన్ కమ్ టాక్స్ మొదలయిది 160 సంవత్సరాలయిందన్న. మొదటి సారి  1860లో ఇన్ కమ్ టాక్స్ ను ప్రవేశపెట్టారు. నిజానికి మొదటి స్వాతంత్య్రం సంగ్రామం మొదలుపెట్టినందుకు భారతీయుల మీద ఒక శిక్షగా ఈ టాక్స్ ను విధించారు.

William Simpson, E Walker and others, after G F Atkinson (wikipedia)

1857 సిపాయిల తిరుగబాటు అణచేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వానికి భారీ ఖర్చయిందని, ఆ ఖర్చును వసూలు చేసుకునేందుకు ఈ టాక్స్ ను విధించారు. సైనిక తిరుగుబాటును అణచేందుకు చేసిన ఖర్చలోటు ఎలా పూరించుకోవాలో చెప్పాలని బ్రిటిష్ ప్రభుత్వం స్కాటిష్ వ్యాపారవేత్త జేమ్స్ విల్సన్  ను నియమించింది. ఈ జేబ్స్ విల్సన్ ఎవరనుకుంటున్నారు, ప్రఖ్యాత వారపత్రిక ది ఎకానమిస్టు (1843 The Economist) వ్యవస్థాపకుడు. ఆయన ఆర్థిక వ్యవహారాల మీద బాగా పట్టు ఉంది. ఆయనకు ఆరోజుల్లో ఎంతపేరు ఉంది అంటే, చివరకు కమ్యూనిస్టు సిద్దాంత పితామహుడు కార్ల్ మార్క్స్ కూడా  జేమ్స్ ని ఒక ఉన్నత స్థాయి ఆర్థికవ్యవహారాల నిపుణుడు (Economic mandarin of high standard) అని Das Capitalలో ప్రశంసించాడు. అప్పటికే ఆయన ఇండియా లో చార్టర్డ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను స్థాపించి  ఉన్నాడు.

1860 ఫిబ్రవరి 18న  ఇంగ్లీష్ బడ్జెట్ నమూనాలో  జేమ్స్ విల్సన్ భారతదేశానికి సంబంధించి మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆందులో మూడు రకాల టాక్స్ లను ప్రతిపాదించారు. అవి ఇన్ కమ్ టాక్స్, లైెసెన్స్ టాక్స్, టాబాకో టాక్స్.  అయితే, అప్పటి గవర్నర్ జనరల్ లార్డ్ క్యానింగ్ (Lord Charless Canning) లైసెన్స్ టాక్స్, టొబాకో టాక్స్ లను తీసేయించారు. అది ఆ యేడాది జూలై 24 నుంచి అమలులోకి వచ్చింది. అందుకే ఈ సెలెబ్రేషన్.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *