నిజామాబాద్ జిల్లా: బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం తడ్ పాకల్, సావెల్ గ్రామం వద్ద వరదల్లో చిక్కుకున్న ఏడుగురు ఆశ్రమవాసులను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెల్లవారు జామున బయటకు తీసాయి..
ఈ విషయం తెలుసుకున్న మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆశ్రమంలో చిక్కుకున్న వారితో మాట్లాడి ధైర్యం చెప్పి ప్రభుత్వ యంత్రంగాన్ని అప్రమత్తం చేశారు. చివరి వరకు మానిటరింగ్ చేస్తూ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రప్పించారు. టీమ్ వారిని క్షేమంగా ఆశ్రమం నుంచి బయటకు తీసుకువచ్చింది. ఎప్పటికప్పుడు గోదావరి వరద ఉధృతి పెరుగుతూ ఉంది. మరొక వైపు రాష్ట్రంలో కృష్ణానది కూడా వరద ప్రవాహంతో పవరళ్లు తొక్కుతూ ఉంది.
ఉత్తర తెలంగాణలో విపరీతంగా వర్షాలు కురవడం, మహారాష్ట్రలో కూడా భారీగా వర్షాలు రావడం గోదావరి పొంగుతూ ఉంది. అదేవిధంగా వివిధ జిల్లాలో అనేక వూర్లు వరద మయమయ్యాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్టు ప్రకారం కొమరం భీమ్ ఆసిఫా బాద్ జిల్లాలో ఒక వ్యక్తి వరదలో కొట్టుకుపోయడు. ఈ సంఘటన నర్నూర్ మండలం, ఉమ్రి గ్రామంలో జరిగింది. ఇక్కడ ఒక సెలయేరుకు వరదలొచ్చాయి. ఆసమయానికి ఆయన కాలువ దాటుతూ ఉన్నారు. ఒడ్డు కొన్ని మీటర్ల దూరాన ఉండగానే వరద తీవ్రంకావడంతో ఆయన కొట్టుకుపోయినట్లు సమాచారం. అధికారులు ఆ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.
తెలంగాణ లో అత్యధిక వర్షపాతం నమోదయిన ప్రాంతాలివే…