24 గంటల వర్షపాతం రికార్డు బ్రేక్ చేసిన మహాబలేశ్వర్

పశ్చిమ కనుమల్లో కృష్ణమ్మ జన్మస్థలం మహాబలేశ్వర్  24 గంటల వర్షపాతంలో రికార్డు సృష్టించింది.   బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం 83.0 మధ్య  మహాబలేశ్వర్ లో480 మి.మీ వర్షపాతం (48 సెం.మీ నమోదయింది. ఇంత వర్షంపాత ఇటీవల ఎపుడూ రాలేదు. గతంలో  1977జూలై 7న 439 మి.మీ వర్షపాతం రికార్డయింది.

పశ్చిమ కనుమల్లో ఉండే ప్రఖ్యాత హిల్ స్టేషన్ మహాబలేశ్వర్. 2019 సెప్టెంబర్ పది నాటికి మహాబలేశ్వర్ వార్షిక వర్షపాతం 8000 మి.మీ (800 సెం.మీ) దాటి ప్రపంచంలో అతి చిత్తడి ప్రదేశం (wettest place on Earth)గా గుర్తింపు పొందింది. గతంలో మేఘాలయలోని చిరపుంజికి ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యేప్రాంతంగా గుర్తింపు ఉండింది. తర్వాత ఈ కీర్తి మాసిన్రామ్ (Mawsynram)కు దక్కింది. మాసిన్రామ్ లో సంవత్సరానికి 11,870 మి.మీ వర్షం కురుస్తుంది. చిరపుంజి వార్షిక  వర్షపాతం  11,777 మి.మీ. ఇపుడు ఈ జాబితాలోకి మహాబలేశ్వరం వచ్చి చేరింది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి  4,400 అడుగుల (1.353మీ.) ఎత్తున ఉంటుంది. దీనికి స్ట్రాబెర్రీ కంట్రీ అని పేరుంది. దేశంలో పండే స్ట్రాబెర్రీ పంటలో  85శాతం మహాబలేశ్వర్ లోనే పండుతుంది.

చిత్రమేమిమంటే, ఈ హిల్ స్టేషన్  అయిదు నదులకు జన్మస్థానం. ఇందులో కృష్ణానది చాలా పెద్ద నది. మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ల గుండా ప్రవహించి ఈ నది బంగాళాఖాతంలో కలుస్తుంది.

శుక్రవారం ఉదయం వరకు ఆల్మట్టి జలాశయానికి లక్ష క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో వచ్చే అవకాశం ఉంది. ఇవ్వాళ ఉదయానికి ఆల్మట్టికి 52,500 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా నీటి నిల్వ 100 టిఎంసీలకు చేరింది. మరో 30 టిఎంసీలు వస్తే పూర్తిగా నిండుతుంది. ఎగువ నుంచి భారీ వరద వచ్చే సూచనలున్నప్పుడు రిజర్వాయర్ ను 20-30 టిఎంసీలు ఖాళీ పెడతారు.

తుంగభద్రకు 60 వేల క్యుసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. నీటి నిల్వ 60 టిఎంసీలు దాటింది. మరో 40 టిఎంసీలు చేరితే వచ్చిన నీరు వచ్చినట్టే శ్రీశైలానికి వదిలి పెడ్తారు. మరో వారం రోజుల్లో శ్రీశైలం ఇన్ ఫ్లో 2 లక్షలు దాటొచ్చు. ఆగస్టు మొదటి వారానికి రిజర్వాయర్ నిండుతుంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *