(భూమన్)
తిరుపతికి 30 కిమీ దూరాన ఉంటుంది గుర్రప్పకొండ. తిరుపతి నుంచి హైవే దారి పడితే, చంద్రగిరి వస్తుంది. అక్కడినుంచి గుర్రప్ప కొండదారి పట్లాలి. దారిలో దోర్నకంబాల, మల్లాయపల్లె, మంటపం పల్లె వస్తాయి. తర్వాత గంగుడుపల్లె. ఈ దారిలో గంగుడుపల్లె చివరి గ్రామం. అక్కడి నుంచి కిలోమీటరు నడుస్తే గుర్రప్పకొండ వస్తుంది. ఒకటే మార్గం. కొండమీద ఉన్న దేవుడు గుర్రప్ప. దేవుడంటే ఏమీ లేదు, అక్కడ రెండు మర్రిచెట్ల మధ్య రెండు రాళ్లు పేర్చడమే. గ్రామదేవతలంటే ఇంతకదా. సాధారణంగా గ్రామ దేవతులు మహిళలే. ఇలా పురుష గ్రామదేవుడు చాలా అరుదు. ఈ రోజు ‘సండే ట్రెక్’ కి చాలా మంది ఆహ్వానించాం. పరిమితి పెట్టలేదు. మంచి రెస్సాన్స్ వచ్చింది. అక్కడి కొండల్లోసాగిన ట్రెక్ ఫోటో గ్యాలరీ.
వర్షాకాలం కావడంతో కొండమీద వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఎక్కడో వర్షంకూడా పడుతూ ఉంది. ఇంద్ర ధనస్సు మా ట్రెక్ ని మరింత ఆహ్లాదకరం చేసింది.
ఇలా తిరుగుముఖం పట్టాం…