తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు నీళ్ల పంపకాల మీద గొడవపడుతున్నాయి. చిన్న స్థాయి యుద్ధాలను తలపించేలా రెండు రాష్ట్రాలు గొడవపడ్డాయి. ప్రాజక్టులకు కాపలా పెట్టుకున్నారు. అధికారులను అనమతించకుండా అడ్డుకున్నారు. రెండు రాష్ట్రాల పోలీసులు తన్నుకున్నారు.చివరకు ప్రాజక్టుల దగ్గిర కేంద్రబలగాలు దించండని కేంద్రాన్ని కోరారు.
నువ్వు కడుతున్న ప్రాజక్టులకు అనుమతి లేదు, అవి అక్రమం అని తెలంగాణ అంటే, ఆంధ్ర కూడా రెచ్చిపోయే తెలంగాణలో కడుతున్న ప్రాజక్టులకు నీళ్ల కేటాయింపులేదు, అనుమతు ల్లేవు అని విమర్శించేది.
నువ్వు నీళ్ల గజదొంగ , మీ నాయన నీళ్ల దొంగ అని తెలంగాణ మంత్రలు జగన్ మీద దాడి చేస్తే కెసిఆర్ పెద్ద నీళ్ల దొంగ అని ఆంధ్రా మంత్రలు అనే వాళ్లు.
ఆంధ్ర తెలంగాణ కడుతున్న ప్రాజక్టులలో వేటికి అనుమతి ఉందో , వేటికి లేదో ఓటర్లకు తెలిసేది కాదు. హూజురాబాద్ ఎన్నికల నేపథ్యంలో అందునా వర్షాకాలం ఆరంభంలో మొదలయిన నీళ్ళగొడవ చిలికిచిలికి ఢిల్లీ దాకా పోయింది.
‘ఇక చాలు, మీ గొడవ, రెండు రాష్ట్రాలలో అక్రమప్రాజక్టులున్నాయి, ప్రాజక్టుల మెయింటెన్స్ మీ చేత కాదు, అని చెప్పి కేంద్ర ప్రాజక్టులన్నింటిని కృష్ణా, గోదావరి బోర్డులకు అప్పగించండి” అంటే నోటిఫికేషన్ జారీ చేసి రెండు తెలుగు రాష్ట్రాలలో కడుతున్న అక్రమ ప్రాజక్టుల జాబితా విడుదల చేసింది.
కేంద్ర జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం తెలంగాణలో అనుమతి లేని ప్రాజెక్టులు…
1.శ్రీశైలం లెఫ్ట్బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ), ఇంటెక్,టన్నెల్, నక్కలగండి రిజర్వాయరు.
2.శ్రీశైలం లెఫ్ట్బ్యాంకు కెనాల్ (ఎస్ఎల్బీసీ) అడిషనల్ 10 టీఎంసీ ఇంటెక్ వర్క్స్
3.కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్
4.కల్వకుర్తి ఎత్తిపోతల అదనపు 15 టీఎంసీల పంప్‌హౌస్
5.పాలమూరురంగారెడ్డి ఎత్తిపోతలు,పంప్‌హౌస్,ఇతర పనులు
6.డిండి (నక్కలగండి) ఎత్తిపోతలు
7.ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల్లో పంప్‌హౌస్, ఇతర పనులు
8.భక్త రామదాసు ఎత్తిపోతల పథకం
9.తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పంప్‌హౌస్,ఇతర పనులు
10.నెట్టెంపాడు ఎత్తిపోతలు పంప్‌హౌస్,ఇతర పనులు
11.నెట్టెంపాడు ఎత్తిపోతల్లో 3.4 టీఎంసీల పంప్‌హౌస్, ఇతర పనులు
12.మునియేరు ప్రాజెక్టు
13.మునియేరు ప్రాజెక్టు హెడ్‌వర్క్స్, రిజర్వాయరు, స్పిల్‌వే,రివర్ స్లూయిస్, కెనాల్ హెడ్‌రెగ్యులేటర్.
14.దేవాదులలోని దబ్బవాగు నుంచి పాకాఆల లేక్ రెగ్యులేటర్ వర్క్స్
15.సీతారామ ఎత్తిపోతలలోని మూడో లిఫ్ట్‌లో నాలుగు పంప్‌హౌస్‌లు.
16.కాళేశ్వరం ప్రాజెక్టు అదనపు టీఎంసీ పనులు
17. పీవీనర్సింహారావు కంతనపల్లి ప్రాజెక్టు బ్యారేజీ
18.రామప్ప–పాకాల లేక్ రెగ్యులేటర్ వర్క్స్
19.తుపాకులగూడెం ప్రాజెక్టు
20మోదికుంట వాగు ప్రాజెక్టు
21.కందకుర్తి ఎత్తిపోతలు
22.డా.బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు
23.గూడెం ఎత్తిపోతల ప్రాజెక్టు
24.ముక్తేశ్వరం (చిన్న కాళేశ్వరం) ఎత్తిపోతలు
25. సీతారామా (దుమ్ముగూడెం) ఎత్తిపోతలు
26.చౌటపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం…