సోమవారం సిఎం జగన్‌ పోలవరం పర్యటన

పోలవరం ప్రాజెక్ట్‌ పనుల పురోగతిని సోమవారం సీఎం  వైఎస్‌ జగన్‌ క్షేత్రస్ధాయిలో పరిశీలించనున్నారు. ఈ పరిశీలనలో వెల్లడైన అంశాల ఆధారంగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. గడువులోగా ప్రాజెక్ట్‌ను పూర్తిచేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేస్తారు. మరొక వైపు పునరావసం లేక వేలాది మంది గిరిజనులు వూర్లలో ఉండలేక, వూరొదిలిపోలేక సతమమతమవుతున్నారు. నిర్వాసితుల కష్టాలు తెలుసుకునేందుకు ఆయన ప్రజలను కలుసుకుంటారోె లేదో తెలియదు.  నిర్వాసిత గిరజనుల గురించి ఆయన ఏదైనా చెబుతారేమోరనని ప్రజలు ఎదురుచూస్తున్నారు.

ఉదయం 10.10 గంటలకు తాడేపల్లి నుంచి  సీఎం బయలుదేరుతారు.

11.10 గంటల నుంచి 12 గంటల వరకు పోలవరం ప్రాజెక్ట్‌ పనులు క్షేత్రస్థాయిలో పరిశీలన ఉంటుంది.

12 గంటల నుంచి 1 గంట వరకు అధికారులతో సమీక్షిస్తారు.

2.20 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

 

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/top-stories/breaking/plight-of-polavaram-project-evacuees/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *