తెలంగాణకు 5 రోజుల భారీ వర్ష సూచన

భారత  వాతావరణ శాఖ  తెలంగాణకు భారీ వర్ష సూచన చేసింది.. పలు  జిల్లాల్లో 5 రోజుల పాటు వానలే వానలు అని చెప్పింది. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.

సోమవారం నుంచి ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

 

అనేక జిల్లాలో  ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కనీసం జూలై20 దాకా ఉండవచ్చని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని రోజుల విరామం తర్వాత శనివారం సాయంకాలం నుంచి రుణపవనాలు తెలంగాణలో మళ్ల చరుకయ్యాయి.

ఇది ఇలా ఉంటే  ఆదివారం  నాడు హైదరాబాద్ నగరంలో పలు  ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నది.

నాంపల్లి, సోమాజీ గూడ, అమీర్ పేట్, పంజాగుట్ట, బంజారా హిల్స్, ఎల్బీనగర్, వనస్థలిపురం, కోఠి అబిద్స్, నాంపల్లి, బేగం బజార్, బషీర్ బాగ్,  లిబర్టీ, హిమయత్ నగర్, నారాయణ గూడలలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. అనేక చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

శనివారం నాడు నల్గొండ జిల్లాలోన పెద్ద ఆదిశేర్ల పల్లిలో 9 సెం. మీ వర్షం పాతనమోదయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *