20 లక్షల మంది భారతీయులు అకౌంట్లను తొలిగించినట్లు వాట్సాప్ (Whatsapp) పేర్కొంది. ఈ యూజర్ల ప్రవర్తన హానీ చేసేలా (Harmful behaviour) ఉన్నందున వారిని తొలగించినట్లు వాట్సా ప్ పేర్కొంది. ఈ తొలగించిపు మే 15 -జూన్ 15 మధ్య మొదలయింది.
భారతదేశంలో అమలులోకి వచ్చి కొత్త ఐటి రూల్స్ ప్రకారం 5 లక్షల కంటే ఎక్కువ మంది యూజర్లు ఉన్న సోషల్ మీడియా వేదికలు ప్రతినెల ఈ రూల్స్ పాటించిన అభ్యంతరకర యూజర్లు మీద చర్యలు తీసుకుంటున్నట్లు, లేదా యూజర్లనుంచి ఫిర్యాదుల మీద చర్యలు తీసుకుంటున్నట్లు నెల నెలా రిపోర్టు(Compliance Report) సమర్పించాలి. దీనిని అనుసరించి వాట్సాప్ సమర్పించిన నివేదికలను 20లక్షల అకౌంట్లను తొలగించినట్లు పేర్కొంది.
“Our top focus is preventing accounts from sending harmful or unwanted messages at scale. We maintain advanced capabilities to identify these account sending a high or abnormal rate of messages and banned two million accounts in India alone from May 15 to June 15 attempting this kind of abuse,” అని వాట్సాప్ తెలిపింది.
వాట్సప్ లో ప్రభుత్వానికి అభ్యంతరకరంగా వస్తున్న మెసేజీల మొదటి సోర్స్ చెప్పాలని భారత ప్రభుత్వం ఈ సంస్థ మీద వత్తిడి తీసుకువస్తూ ఉంది. దీనికి వాట్సాప్ తలొగ్గడం లేదు.
అయితే, ఇంత పెద్ద ఎత్తున వాట్సాప్ యూజర్లను తొలగించడం విశేషం. ప్రపంచం మొత్తంగా హానిచేసే ప్రవర్తన ఆరోపణ మీద తొలిగిస్తున్న మొత్తం అకౌంట్లలో ఇది నాలుగోవంతు.
ఈ మధ్య ప్రభుత్వం వత్తిడితో సోషల్ మీడియా సంస్థలు చాలా అకౌంట్లను తొలగించడమో మాడరేట్ చేయడమో చేస్తున్నాయి. ఇలా ఫేస్ బుక్, ఇన్స్టా 3.2 కోట్ల పోస్టులనలు తొలగించాయి. కూ (koo) 54 వేల పోస్టులను మాడొరేట్ చేసింది. 5.5 వేల పోస్టుల గురించి యూజర్లు ఫిర్యాదు చేశారు. గూగుల్ సుమారు 59 వేల యుఆర్ ఎల్ (URL)లను తొలగించింది.