పాతబస్తీ మాదన్నపేట్ మార్కెట్ వానకాలపు అవతామరమిది!

హైదరాబాద్ లో అందమయిన, హైటెక్ సిటీయేకాదు, మాదన్న పేట్ మార్కెట్ వంటి ప్రదేశాలు కూడా ఉన్నాయి.  మాదన్నపేట  మార్కెట్ వంటి ప్రాంతాలెపుడు హైదరాబాద్ లోని చీకటి ప్రపంచం.

పాలకుల అభివృద్ధి రాడార్ లో ఈ ప్రాంతాలు ఉండవు. ఈ ప్రాంతాల్లోకి అభివృద్ధి గాని, అధికారులు గాని తొంగిచూడాలంటే  ఉపద్రవం ఏదో రావాలి.

మాదన్నపేట మార్కెట్ నగరంలోని ఒక పెద్ద కూరగాయల మార్కెట్. వాన వస్తే ఈ మార్కెట్ మురికి కూపం అవుతుంది. మార్కెట్లోకి ఎవరూ కాలు మోపలేరు. నగరాన్ని ఆరోగ్యంగా వుంచాలంటే ఆసుపత్రులే కాదు, కూరగాయలు మార్కెట్లు అవసరం. అయితే, కూరగాయల మార్కెట్ల మీద  మన పాలకుల్లో ఎంత చిన్నచూపుందో మాదన్నపేట మార్కెట్ ను చూసి తెలుసుకోవచ్చు.

వర్షం కురిస్తే హైదరాబాద్   పాతబస్తీ మాదన్నపేట్ మార్కెట్ ఇలా భయంకర ఆకారం దాలుస్తుంది.  ఎప్పుడు వర్షం పడినా అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న రైతులులో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతుంటారరు.  నిన్నటి నుంచి కురుస్తునమ్న భారీ వర్షానికి మార్కెట్ ఇలా బురదమయం అయింది.

రైతులు, వినియోగదారులు మార్కెట్లోకి రావడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది.  మార్కెట్లోకి వచ్చేందుకు మరొక  మార్గం లేనందున వ్యవసాయ మార్కెట్ కి కూరగాయలు తరలించే ఆటోలో బురదలో ఇరుక్కుపోతున్నాయి.

 

మార్కెట్ ని క్లీన్ చేయాలని కోరుతూ   రైతులు, ర్కెట్లో కూరగాయల వ్యాపారం చేసే వ్యాపారస్తులు మురికి నీళ్లలో నిలబడి నిరసన తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ రైతు సంగం నాయకులు ఏనుగు రాం రెడ్డి,శ్రీనివాస్,రమేష్,సుమన్,ధణ్వీర్ రెడ్డి,పల్లవి,జంగమ్మ,సబిత,శ్రీలత 100 మంది పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *