(టి లక్ష్మినారాయణ)
ఆరేళ్ళపాటు అలసత్వం ప్రదర్శించిన మోడీ ప్రభుత్వం ఎట్టకేలకు ఆ.ప్ర. పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిథులను నిర్ధేశిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నా. జలాశయాల దగ్గర రెండు రాష్ట్రాలు జుట్లు పట్టుకొనే దుస్థితి ఇక ఉండదు.
గజిట్ నోటిఫికేషన్ లో తెలుగు గంగ, హంద్రీ -నీవా, గాలేరు – నగరి, కల్వకుర్తి, నెట్టంపాడు ప్రాజెక్టులను మాత్రమే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014 జాబితాలో ఉన్నట్లు పేర్కొన్నారు. వెలుగొండ ప్రాజెక్టును ఆమోదంలేని ప్రాజెక్టుల జాబితాలో ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తక్షణం స్పందించి గజిట్ నోటిఫికేషన్ కు సవరణ చేయించి, వెలుగొండ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం -2014లో పొందుపరచిన ప్రాజెక్టుల జాబితాలో ఉన్నట్లు ధృవీకరించాలి.
(టి.లక్ష్మీనారాయణ,కన్వీనర్,
ఆంధ్రప్రదేశ్ సమాగ్రాభివృద్ధి అధ్యయన వేదిక)