నిన్ననగరంలోని అనేక ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. కొన్ని చోట్ల100 మి.మీ నుంచి 200 మి.మీ వర్షపాతం నమోదయ్యింది.దీనిని అనేక ప్రాంతాలు వరదమయమయ్యాయి. దీనితో జనజీవనం స్తంభించి 2020 నాటి పరిస్థితులు గుర్తు కొచ్చాయి. గత ఏడాది అక్టోబర్ లో వచ్చిన నగరవరద గుర్తుంది కదా. అపుడు 18 మంది చనిపోయారు. ఈ సారి ఎల్ బినగర్ డివిజన్ లోని ఉప్పల్, సరూర్ నగర్, హయత్ నగర్ , హస్తినాపురం లతోపాటు మీర్ పేట, రామంతపూర్ వరదమయమయ్యాయి. ఇక్కడను చెరువుల నిండి పొర్లిపోయారు. ఈ చెరువులు కుంచించుకుపోవడం, దురాక్రమణకు గురికావడంతో ఈపరిస్థితులొచ్చాయని వేరే చెప్పాల్సిన పనిలేదు.
నిన్నటి హైదరాబాద్ దృశ్యాలు
ఈ రోజు రేపు భారీ వర్షాలు
ఈ రోజు, రేపు కూడా తెలంగాణ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతోపాటు వరంగల్ అర్బన్, గ్రామీణం, మహబూబాబాద్, కరీంనగర్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో కొన్నిచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.