స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచాక కూడా రాజద్రోహం (Sedition) చట్టం అవసరమా అని సుప్రీంకోర్టు ఈ రోజు కేంద్రాన్ని ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ బెంచ్ కు ఒక పెద్ద సవాల్ ఎదురయింది. జాతీయోద్యమ కాలంలో స్వాతంత్య్ర సమర యోధుల గొంతునొక్కేందుకు ఉద్దేశించిన తెల్లవాడి రాజద్రోహం చట్టాన్ని ఇపుడు కొనసాగించాలా వద్దా అనేది ఆయన బెంచ్ ముందున్న ప్రశ్న. ఈ వలసపాలకుల చట్నాన్ని పూర్తిగా రద్దుచేసే విషయం మీద స్పష్టంగా వైఖరి చెప్పాలని ఆయన నేతృత్వంలో ఉన్న ధర్మాసనం ఈ రోజు కేంద్రాన్ని కోరింది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు భారతీయ న్యాయ చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోనుంది.
ఇటీవల దేశంలో రాజద్రోహం చట్టం (ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 214A) కింద దేశమంతా కేసులు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే.దీనితో దేశ వ్యాపితంగా ఇపుడు ఈచట్టం అవసరం మీద పెద్ద చర్చ మొదలయింది. చాలా మంది ప్రజాస్వామిక వాదులు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు, పూర్తిగా దీనిని న్యాయగ్రంధాలనుంచి తొలిగించేయాలని కోరుతున్నారు.
ఎపుడో జాతీయోద్యమ కాలంలో స్వాతంత్య్ర యోధులను నిర్భంధించేందుకు బ్రిటిష్ పాలకులు తెచ్చిన ఈ చట్టాన్ని ఇంకా ప్రయోగిస్తున్నందున, ఈ చట్టం చెల్లుబాటును ఒక మాజీ సైనికుడు ప్రశ్నించారు. ఆయన వేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
ఈ పిటిషన్ ను అర్మీ హెడ్ క్వార్టర్స్ కుచెందిన రిటైర్డు అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఎస్ జి వాంబత్కేరే దాఖలు చేశారు. ఈ పిటిషన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది.
ఈ చట్టంలో ‘ప్రభుత్వం మీద అభిమానం చూపించకపోవడం’ ( disaffection towards Government), ‘వైషమ్యం’ (Hatred) , ‘ధిక్కరణ’ (contempt), ‘శత్రువైఖరి ప్రోత్సహించడం’ (feeling of enmity)వంటి నిర్వచనం లేని పదాలున్నాయని, వీటిని ఆధారం చేసుకుని రాజ్యాంగంలోని అధికరణం 19(1)(a) కింద పౌరులకు సంక్రమించిన వాక్ స్వాతంత్య్రం మీద ఆంక్షలు విధిస్తున్నారని, వాక్స్ స్వేచ్ఛను స్తంభింపచేసున్నరని పిటిషనర్ పేర్కొన్నారు.
“A statute criminalizing expression based on unconstitutionally vague definitions of “Disaffection Towards Government’, ‘Hatred’, ‘Contempt’ and ‘Feeling of enmity’ is an unreasonable restriction on the the fundamental right to free expression guaranteed under Article 19 (1)(a), and causes constitutionally impermissible “Chilling Effect” on speech”
పిటిషన్ ను విచారణకు స్వీకరిస్తూ నేడు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. ఇలాంటి చట్టం పరిపాలనకే కాదు, వ్యక్తులకు ముప్పేనని కోర్టు వ్యాఖ్యానించింది. నిరసన గొంతునొక్కేందుకు తెచ్చిన 1870 నాటి చట్టం కొనసాగించడం మీద తనకు కొన్ని మినహాయింపులున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ చట్టాన్ని మహాత్మాగాంధీ, తిలక్ వంటి వారి మీద ప్రయోగించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
“This dispute of law is concerned, its colonial law, it was meant to suppress the freedom movement, the same law was used by British to silence Mahatma Gandhi, Tilak, etc. Still is it necessary after 75 years of independence?”
ఈ చట్టాన్ని పూర్తిగా కొట్టేయ వద్దని, ఈ చట్టం ఎక్కడ దుర్వినియోగపడుతున్నదో ఆ ఆంశాలను మాత్రమేపరిగణనలోనికి తీసుకుని, వాటిని దుర్వినియోగ పర్చకుండా మార్గదర్శకాలను విడుదల చేయాలని అటార్నిజనరల్ కెకె వేణుగోపాల్ కోర్టు ను కోరారు.
దీనికి స్పందిస్తూ, ఇది పూర్తిగా వలసపాలకుల చట్టం. ఇలాంటి చట్టాన్ని ఇంకా మన న్యాయగ్రంధాలలో కొనసాగించాల్సిన అవసరం ఉందా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు.
‘ఈ పిటిషన్ లో వేయడంలో పిటిషనర్ కు ఎలాంటి దురుద్దేశం లేదు. ఎందుకంటే, ఆయన జీవితమంతా దేశ రక్షణలో గడిపారు. కాబట్టి అలాంటి వ్యక్తి ఉద్దేశాలను శంకించలే’మని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
బ్రిటిషోళ్లు తెచ్చిన (colonial) చట్టాలనిఎన్నింటినో రద్దు చేసుకున్నా, మన జాతీయోద్యమాన్ని అణచేసేందుకు ఉద్దేశించిన ఈ చట్టాన్ని ఇంకా ఎందుకుంచుకుంటున్నారని కోర్టు ప్రశ్నించింది.
‘ఏదో వస్తువు చేయడానికి ఒక కార్పరెంటర్ కు ఒక రంపం ఇచ్చాం. అయితే, అతగాడు ఏదో చెట్టును కొట్టకుండా మొత్తం అడివినంతా నరికేస్తున్నట్లుంది ఇపుడు ఈ చట్టం అమలు చేస్తున్నతీరు,’ అని ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
“If we go to the history of charging this section, the enormous power of this section can be compared to a carpenter being given a saw to make an item, who uses it to cut the entire forest instead of a tree. That is the effect of the provision,” అని ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.
ఈ చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారని తాను ఏ ప్రభుత్వాన్ని నిందించడం లేదని కూడా జస్టిస్ రమణ స్పష్టం చేశారు.
“Unfortunately, the executing agency and particular the authorities misuse it. Take the example of 66A which was struck down put people are arrested. There is a misuse of provisions, but there is no accountability.”
ఈచట్టం కింద పెట్టే కేసులుకు బెయిల్ రాదు. 1962లో కేదార్ నాథ్ సింగ్ వర్సెస్ బీహార్ స్టేట్ (Kedarnath Singh vs State of Bihar) కేసులో సుప్రీంకోర్టు ఈ చట్టాన్ని సమర్థించింది. ఈ విషయాన్న కూడా పిటిషనర్ ప్రస్తావిస్తూ 1962 లో కోర్టు తీర్పు వచ్చేటప్పటికి ప్రాథమిక హక్కల నిర్వచనం స్పష్టంగా లేదని, ఇపుడా పరిస్థితిపోయిందని పిటిషనర్ పేర్కొన్నారు.
సమర్థనీయం గాని 124A చట్టాన్ని పూర్తిగా తొలగించేందుకు యోచించాలని,ఈ విషయంం మీద కేంద్రం వైఖరి స్పష్టంగా తెలపాలని ధర్మాసనం కోరింది. ఇదే అంశం మీద మరిన్ని పిటిషన్లు దాఖలయ్యాయని అన్నింటిని కలిపి విచారిస్తామని తెలిపింది.