మాస్కు లేక పోతే కృష్ణా జిల్లాలో వారానికి మూడు రోజులు కష్టాలే…

 

కోవిడ్ పై అవగాహన కార్యక్రమాలను నిరంతరం కొనసాగించే దిశగా వారంలో మూడు రోజుల పాటు వినూత్నంగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని  జిల్లా కలెక్టర్ జె.నివాస్ నిర్వహిస్తారు.

‘నో మాస్కు – నో ఎంట్రీ’, ‘నో మాస్కు – నో రైడ్’ , ‘నో మాస్కు – నో సేల్ ‘ అనేవి ఈ క్యాంపెయిన్ నినాదాలు. ఈ మూడు రోజులు మాస్కు లేని వారిని ఎక్కడిక్కడ నిలిపేస్తారు. సోమవారంనాడు నో మాస్క్ ఎంట్రీ,  మంగళవారం నాడు నో మాస్క్ నో రైడ్, బుధవారం నాడు నో మాస్క్, నో సేల్ క్యాంపెయిన్ ఉంటుంది.

ఈ  ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రతి సోమవారం  ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లోకి ప్రార్థన మందిరాల్లోకి , బ్యాంకులు , ఫోస్టు ఆఫీసులు , మాల్స్ , పబ్లిక్ పార్కులు , పరిశ్రమలు , వాణిజ్య ప్రాంతాలు , రెస్టారెంట్లులోకి మాస్కులు లేకుండా ఎవరినీ అనుమతించరు.

ప్రతి మంగళవారం నో మాస్క్- నో రైడ్ నినాదంతో వాహన చోదకులు , ప్రయాణికులు, తప్పనిసరిగా మాస్కులను ధరించాలి. లేకపోతే రోడ్ల మీద తిరగనీయరు.

ప్రతి బుధవారం నో మాస్క్ -నో సేల్ అన్న నినాదంతో మాస్కులు ధరించని కొనుగోలు దారులకు దుకాణదారులు , సరుకులు , వస్తువులను విక్రయించకూడదు.

అదే విధంగా ఈ అంశంపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు బ్యానర్లు , వాల్ పోస్టర్లు , మైక్ ద్వారా ప్రచారం నిర్వహించడంతోపాటు మాస్కులు పంపిణీ చేస్తారు.

కోవిడ్ ముప్పు పూర్తిగా తొలగలేదని ఈ దృష్ట్యా ప్రజలంత కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం ఈ క్యాంపెయిన్ ఉద్దేశం.

సెప్టెంబర్ నెలఖారు వరకు ప్రతి వారంలో మూడు రోజుల పాటు ” నో మాస్క్ – నో ఎంట్రీ ” , ” నో మాస్క్ – నో రైడ్ ” , “ నో మాస్క్ – నో సేల్ ” నినాదాలతో ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు.

ప్రతి ఒక్కరూ కోవిడ్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని , భౌతిక దూరం పాటించాలని , చేతులను తరచు శుభ్రపరచుకోవాలని కలెక్టర్ నివాస్ ఒక ప్రకటనలో సూచించారు .

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో దృష్టి కేంద్రీకరించి మూడు నెలల పాటు ఈ ప్రచార కార్యక్రమాలను రూపొందించిన్నట్లు తెలిపారు . ఇందులో భాగంగా బ్యానర్లు , ప్లేకార్డులు , ప్రదర్శించడం , కర్రపత్రాలు , స్టికర్లు , వాల్ పోస్టర్లు పంపిణీ చేయడం విషయాలపై సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు .

కోవిడ్ రహిత జిల్లాగా కృష్ణాజిల్లాను ఉంచేందుకు అందరం సమిష్టిగా కృషి చేద్దామని కలెక్టర్ జె . నివాస్ పిలుపునిచ్చారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *