(హైదరాబాద్ సిటి డెస్క్)
హైదరాబాద్ దోమలు బాగా బలుస్తున్నాయ్, వీటికి దోమల మందును తట్టుకునే శక్తి వస్తాంది. జిహెచ్ ఎంసి అపుడపుడు దోమల నివారణ కోసం చేసే ఫాగింగ్ వల్ల చావకుండా ఈ దోమలు రెసిస్టెన్స్ శక్తి సమకూర్చుకున్నాయి. దీనితో దొమల బెడద మహానగరంలో తీవ్రమయింది. అనేక ప్రాంతాలలో ప్రజలు దోమలతో సతమతమవుతున్నారు. ఈ పరిస్థితి మీద టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనం ప్రచురించింది.
చివరకు, జిహెచ్ ఎంసి చేపట్టిన దోమల లార్వాల నాశనం (anti-larvae operations) చేసే కార్యక్రమాలు కూడా విజయవంతం కాలేదు. హైదరాబాద్ లో డెంగీ కేసులు తీవ్రమవుతున్నాయన్న వార్తల మధ్య ఈ దోమలూ బలుస్తున్నాయన్న వార్తలొస్తున్నాయి. అదికూడా కరోనా వైరస్ కేసుల మధ్య
దోమల నివారణకు, దోమల లార్వాల నివారణకు జిహెచ్ఎంసి అధికారులు చాలా ప్రయోగాలు చేశారు. రెగ్యులర్ గా చేసే ఫాగింగ్, యాంటి లార్వా కార్యకలాపాలు, దోమల లార్వాలను తినే చేపలను నగరంలో చెరువుల్లో విడుదల చేయడం వంటి కార్యకలాపాలు అధికారులు చేపట్టారు. దోమతెరలు, మస్కిటో రిపెల్లెంట్స్, ఇన్సెన్స్ స్టిక్స్, వల్ల పెద్దగా భద్రత ఉండటం లేదు. కొన్ని రకాల రిపెల్లెంట్స్ వల్ల శ్వాస సంబంధమయిన అలెర్జీ వస్తున్నది. అందువల్ల ప్రజలుకు దోమలనుంచి భద్రత మార్గాలు దొరకడం లేదు. ఎంత పెద్ద వాళ్లయినా దోమల బెడద ఎదుర్కొనక తప్పడం లేదు.
“We have some peace only during the daytime. Once it’s 6 pm, our only focus is how to get rid of these mosquitoes. I have liquid mosquito repellents, coils, and sprays, but nothing is working,” అని హైదరాబాద్ లోని 70 లక్షల జనాబా బాధను ఒక నగరవాసి వ్యక్తీకరించారు. హైదరాబాద్ లో ఏమూలన వున్నా, హైదరాబాదీలందరిది ఒకటే బాధ, దోమల బెడద.
చీకటి పడగానే హైదరాబాద్ ప్రజలు దోమలతో యుద్ధం మొదలుపెడతారు. ప్రతిరోజూ వోడిపోతారు. ఇపుడు వర్షాకాలం మొదలు కావడంతో హైదరాబాద్ లో డెంగీ జ్వరం తెచ్చే దోమ (Aedes Aegypti)ల బెడద ఎక్కువయింది. ఈ దోమలను పట్టిచంపేందుకు జిహెచ్ ఎంసి అధికారులు ట్రాప్స్ ఏర్పాటు చేస్తున్నారు.అదొక ప్రయోగం మాత్రమే. మొత్తానికి హైదరాబాద్ లో డెంగీ కేసులు మొదలయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని సిటీ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
గత నెలలోె డెంగీ కేసులు లేవు. ఇపుడు కనీసం వారానికి అయిదారు కేసులు వస్తున్నాయని ఈ కేసులకు చికిత్స చేస్తున్న డాక్టర్లు అంగీకరిస్తున్నారు. వీటికి కోవిడ్-19 ఇన్ ఫెక్షన్ తోడయితే పరిస్థితి విషమిస్తుంది.
హైదరాబాద్ ని దోమలు కభళించడానికి మునిసిపల్ అధికారులే కారణమని అనలేం. దోమలు రెండు రకాల కారణాల వల్ల వస్తాయి: నీళ్లు నిల్వవుండటం. కాలువల్లోకి చెత్త వేయడం. హైదరాబాద్ లో తీవ్రమయిన సమస్య కావాడానికి ప్రజలను కూడా నిందించాల్సి వస్తుంది. గ్రీన్ హైదరాబాద్ అని ఎంత మొత్తుకున్నా, హైదరాబాద్ ప్రజలు తమ కాంపౌండ్ బయటే ఇంట్లో చెత్త వేయడానికి ఇష్టపడతారు. తమ ఇల్లు వాకిలి శుభ్రంగా వుంటే చాలు, వూరు వల్లకాడయినా పర్వాలేదనుకునే మనస్తత్వం హైదరాబాదీల్లో ఎక్కువ. ఎక్కడయినా కాలనీల్లో ఒక ఖాళీ స్థలం ఉంటే చుట్టు పక్కల ఇళ్ళ వాళ్లంతా దానిని క్షణాల్లో డంప్ యార్డ్ గా మార్చుకుంటారు. ఇంటెదురుగానే చెత్త ఉంటున్నా సరే లెక్క చేయరు. కనిపించిన ప్రతి ఖాళీ స్థలంలో చెత్త వేయడానికి హైదరాబాదీలు ఉబలాటపడతారు. ఎక్కడెక్కడో ఉన్న బిల్డర్లు కనస్ట్రక్షన్ వేస్టు తీసుకొచ్చి ఇక్కడే వేస్తుంటారు. మునిసిపల్ అధికారులు ఇది చూసిచూడనట్లు పోతుంటారు. భారీగా కనస్ట్రక్షన్ వేస్ట్ ఇలా వీధుల్లో పడేస్తున్నా జిహెచ్ ఎంసి అధికారులు చూడటం లేదంటే, బిల్డర్లకు, అధికారులకు ఎంవొయు ఏదో కుదిరిందనే అనుకోవాలి. ఇలా ఖాళీ జాగా ఎక్కడా కనపడినా ఆనందంగా చెత్త వేసి ఆ ప్రాంతాన్నంతా మురికికూపం చేయడం హైదరాబాద్ ప్రజలకు బాగా ఇష్టం. ఖాళీ జాగా కనిపించకపోతే, విలవిల్లాడి పోతారు. ఇదే విధంగా వరద కాలువల్లోకి, నాలాల్లోకి చెత్తవేయడంలో హైదరాబాద్ వాసులు నెంబర్ వన్ స్థానంలో ఉంటారు.
ఈ చెత్త, కాలువల్లో, నీటికుంటల్లో, ఖాళీ జాగాల్లో కుళ్లిపోయి, నగరమే చెత్త కుండి అవుతూ ఉంది. అధికారులు మొక్కుబడిగా ‘గ్రీన్ హైదరాబాద్ ’ అమలుచేయడం, ప్రజలు ‘బాధ్యతాయుతం’గా చెత్తను బయట విసిరేయడం వల్లే హైదరాబాదొక పెద్ద ‘దోమలగూడ’ గా మారేందుకు కారణం అనక తప్పదు.
“We have the issue of mosquito menace despite taking up so many measures due to stagnant water, both indoor and outdoor. We have seen people throwing garbage directly into lakes and there is also domestic drainage flow into these water bodies. This problem will not be solved until the community takes charge, “అని జిహెచ్ ఎంసి ఎంటమాలజిస్టు డాక్టర్ ఏ రాంబాబు టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.
‘గ్రీన్ హైదరాబాద్’ అంటే నాయకులంతా ఒకటి రెండు చెట్లు నాటి ఫోటోలు తీయుంచుకోవడమే అనుకుంటారు. ఇదే భావన ప్రజల్లో కూడా ఉంది. చెట్టు నాటేది నాయకుల పని అనుకుంటారు. అందుకే ప్రజలు చెట్టునాటుతున్న దృశ్యం ఎక్కడా కనిపించదు. ఎపుడైనా ప్రభుత్వం పిలుపు ఇస్తే, లోకల్ లీడర్లు పండగ లాగా మొక్కలు నాటడం చేస్తారు. ప్రజల్ని తోలి నాటిస్తారు. ఇది వేరే కథ.
మంత్రులు, ఎమ్మెల్యలేలు, ఇతర నేతలు, అధికారులు, క్రీడాకారులు, నటీనటులు చెట్లునాటడంలో చూపూతున్న ఉత్సాహం చెత్త వూడ్చడం మీద చూపరు. ఎందుకు, చెత్త గ్లామరస్ గా ఉండదు. ఫోటోలకు పనికి రాదు.
మొక్కలు నాటేందుకు ఒక చిన్న పాదు తవ్వి, పాదు చుట్టూ చక్కగా పూరెక్కలతో సింగారించి, రంగులు అద్ది, చక్కటి వాటర్ స్ప్రేయర్ పట్టుకుని, ఫోటో తీస్తున్నపుడు మొక్కొకటి నాటి, సోషల్ మీడియాలో పోస్టు చేసుకుని మురిసిపోవడం మనం రోజూ చూస్తున్నాం. నిజానికి ఇదే హంగామాతో చెత్త వూడ్చేందుకు యువ ఎంపిలు, నేతులు పూనుకోవాలి. గ్రీన్ ఇండియాకు చెట్లు నాటడం ఎంత ముఖ్యమో, చెత్త వూడ్చటం కూడా అంతే ముఖ్యం.
ఇదే ఉత్సాహం నగరాలను చెత్త రహితం చేయడం, తద్వారా దోమలు లేకుండా చేయడం మీద ఎందుకు చూపరు? వూరును చెత్త కుండి చేసుకుని వూరిబయట మొక్కలు నాటితే, గ్రీన్ తెలంగాణ కానేకాదు.
దోమల నివారణ కోసం ఫాగింగ్ ను ఎంత మొక్కుబడిగా చేస్తున్నారో డాక్టర్ ఎ. రాంబాబు కు చెప్పారు.
“Even though fogging does not eradicate mosquitoes completely, we are doing it mainly due to demand from the public. We use a chemical called Malathion which doesn’t kill dengue or chikungunya causing mosquitoes. As per WHO, fogging is not advisable as it causes health issues for children, the elderly and pregnant women.”
ఫాగింగ్ వల్ల పిల్లలకు, వృద్ధులకు, గర్భీణీ స్త్రీలకు సమస్య లొస్తున్నా, ప్రజల వత్తడితో ఫాగింగ్ చేస్తున్నామని డాక్టర్ రాంబాబు ఒప్పుకోవడం ఏమిటో?
మొత్తానికి డెంగీ దోమలు పెరుగుతున్నాయ్, డెంగీ కేసులు పెరుగుతున్నాయి అంతా అప్రమత్తంగా ఉండాల్సిందే.
(Featured is credit pixabay)