(మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి)
కత్తి మహేష్ మరణ వార్త బాధాకరం. వారి అభిప్రాయాలతో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కానీ వ్యక్తిగతంగా నాకు పరిచయం ఉన్న మహేష్ మంచి మనిషి. 3 సంవత్సరాల క్రితం టీవీ 9 తిరుపతిలో నిర్వహించిన ప్రత్యేక హోదా చర్చా గోష్ఠిలో పరిచయం అయినారు. అప్పటికే మహేష్ గుర్తింపు పొందిన వ్యక్తి. నేను రాయలసీమకు జరిగిన అన్యాయం గురించి ఆందోళన వ్యక్తం చేశాను. నేను ప్రస్తావించిన అంశాలను విన్న మహేష్ తనకు తాను పరిచయం చేసుకుని అన్నా నేను కూడా రాయలసీమ వాడినే చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గ వ్యక్తిని. నేను చాలా సమస్యలుపై స్పందిస్తున్నాను. రాయలసీమకు జరుగుతున్న అన్యాయంపై కూడా పని చేయాలని అనిపిస్తుంది అంటూ నాటి నుంచి నేటి వరకు ఎప్పుడు తిరుపతికి వచ్చినా నాతో మాట్లాడకుండా వెళ్లేవాడు కాదు.
వచ్చిన ప్రతిసారి టి , భోజనం కలిసి చేయాలని కోరేవాడు. కలిసినంత సేపు మన సీమకు ఎక్కడ అన్యాయం జరిగింది , కారణం ఏమిటి , ఏమి జరగాలి నాలాంటి వారు ఏమి చేయాలి అని విద్యార్థి లాగా అడిగి తెలుసుకున్నారు. రాయలసీమ అంశాలు పార్టీల అనుబంధాలు లేవు అని నికార్సుగా చెప్పే వ్యక్తి మహేష్ .
దళిత ఉద్యమంలో మహేష్ లో నాకు కొత్త కోణం కనిపించేది. నేను బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని అని చెప్పుకోవడానికి ఇష్టం ఉండేది కాదు. మాకు రావాల్సిన హక్కులు పోరాడి సాధించుకోవాలి అనే పట్టుదల కనపడేది. భావవ్యక్తీకరణలో ఎంతో దూకుడుగా ఉండే మహేష్ వ్యక్తిగతంగా చిన్న పిల్లవాడిగా వ్యవహరిస్తారు. మహేష్ తో నా పరిచయం 3 సంవత్సరాలు నన్ను బాగా ఇష్టపడే వ్యక్తి. ఎప్పుడు తిరుపతికి వచ్చినా కలిసి భోజనం చేయాలి లేకపితే ఒప్పుకునే వాడు కాదు. కారణం ఏమో కానీ నన్ను బాగా ప్రేమించాడు. ఎప్పుడూ మాట మీద ఉండే మహేష్ నువ్వు మొదటి సారి మాట తప్పావు మల్లికలుద్దాం అన్నా అని చెప్పి కలవడానికి లీలు లేనంత దూరం వెళ్లి బాధపెట్టావు.
మహేష్ నీతో గడిపిన రోజులు మరిచి పోలేని తీపి గుర్తులు. అవి పదిలంగా ఉంటాయి. మీకు కన్నీటి వీడ్కోలు మహేష్ .