గాంధీభవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంగారెడ్డి ఎమ్మేల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి షర్మిల పార్టీ మీద ఆసక్తి కరమయిన వ్యాఖ్యలు చేశారు.
“జగన్ సోదరి తెలంగాణ లో వైస్సార్ పార్టీ అంటూ కొత్త డ్రామాకు తేర లేపారు. షర్మిల తెలంగాణ కోడలే అయినా ఆమెది రాయలసీమ రక్తమే కదా. అన్న ఆడ, చెల్లెలు ఈడ ఏంటి ఈ నాటకాలు?
అన్నా చెల్లెళ్ళు ఇద్దరూ లోటస్ పాండ్ లో అంతా కలిసే ఉంటారు. బయట వేర్వేరు పార్టీలు. షర్మిల పార్టీ వెనుక బీజేపీ హస్తం ఉంది. అందుకే ఇప్పటివరకు జగన్ ఏ ఇష్యూలో బిజెపి ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు.విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరమ్ చేస్తానంటే, కార్మికులు రోడ్ల పైకి వచ్చినా జగన్ నోరు మెదపరు.”