వచ్చే మూడు రోజుల్లో ఆంధ్రలో భారీ వర్షాలు

వాయువ్య బంగాళాఖాతం ఉత్తరాంధ్ర–దక్షిణ ఒడిశా తీరప్రాంతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని , దీని ప్రభావంతో రేపు మోస్తారు వర్షాలు పడవచ్చని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం, సోమవారం అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని,  తీరం వెంబడి గంటకు 50-60 కీ.మీ వెగంతో గాలులు సముద్రం అలజడిగా ఉంటుంది. మత్స్యకారులు మంగళవారం వరకు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఆంధ్రప్రదేశ్ విపత్తుల శాఖ తెలిపింది.

రాగల మూడు రోజులకు వాతావరణ సూచన

జూలై 10 శనివారం : ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడతాయి. మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

జూలై 11 ఆదివారం : కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడవచ్చు. రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు
మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.

జూలై 12 సోమవారం : రాష్ట్ర వ్యాప్తం వర్షాలు కురుస్తాయి. ఒక మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు పడే అవకాశం. కొన్ని భారీ వర్షాలు కురుస్తాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్  విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *