(సలీమ్ బాషా)
హంగేరీ జాతీయ హీరో టాకాక్స్
హంగేరి కి చెందిన ఎడమ చేతి వాటం షూటర్ టాకాక్స్ ఒలంపిక్స్ హీరోలలో ఒకడు.1938 లో సైనిక శిక్షణ సమయంలో, గ్రెనేడ్ పేలినప్పుడు అతని కుడి చేతికి తీవ్రంగా గాయమైంది.టాకాక్స్ తన షూటింగ్ వృత్తిని కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు అలా అతను ఎడమ చేతితో ఎవరికి తెలియకుండా రహస్యంగా షూటింగ్ ప్రాక్టీస్ చేయడం ప్రారంభించాడు. 1939 లో హంగేరియన్ జాతీయ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకొని తన దేశ ప్రజలను ఆశ్చర్యపరిచాడు. అతను 1939 యుఐటి వరల్డ్ షూటింగ్ ఛాంపియన్షిప్ గెలుచుకున్న హంగేరియన్ జట్టులో సభ్యుడు కూడా. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1940, 1944 ఒలంపిక్స్ రద్దు చేయబడ్డాయి.1948 సమ్మర్ ఒలంపిక్స్ లో అతను ఈ ఘనత సాధించాడు.1948 లండన్లో జరిగిన వేసవి ఒలింపిక్స్ లో టాకాక్స్ బంగారు పతకం సాధించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. పతకాల వేడుకకు వచ్చే సమయానికి, రెండవ స్థానంలో ఉన్న వాలియంట్ టాకాక్స్ వైపు చూస్తూ అలాగే నిలబడిపోయాడు. తన ఎడమ చేతితో, టాకాక్స్ ప్రపంచ రికార్డ్ స్కోరుతో స్వర్ణం సాధించాడు.వాలియంట్ టాకాక్స్ వైపు తిరిగి: “మీరు తగినంతగా నేర్చుకున్నారు.” అని ప్రశంసించాడు. ఇలాంటి ఘనత సాధించిన ఏకైక వ్యక్తి టాకాక్స్.
అతను మళ్లీ 1952 హెల్సింకి లో జరిగిన సమ్మర్ ఒలంపిక్స్ లో తన రెండవ బంగారు పతకం సాధించాడు. అలా అతన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ “ఒలింపిక్ హీరోలలో” స్థానం ఇచ్చింది.
(సలీమ్ బాషా, స్పోర్ట్స్ జర్నలిస్టు, హోమియో వైద్యుడు. ఫోన్ 9393737937)