జగన్ అసెంబ్లీలో చేసిన ‘ఉక్కు’ తీర్మానం ఫేకా?

విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్దంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖ‌లు ఫేక్ అని తెలుగు దేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీక‌ర‌ణ ప్రక్రియను వేగ‌వంతం చేయ‌డంతో ఈలేఖలు ఫేక్ అని తేలిపోయిందని ఆయన ట్వీట్ చేశారు.

ఫేక్ సీఎం జ‌గ‌న్‌రెడ్డి గారూ! విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీక‌ర‌ణ వ‌ద్దంటూ మీరు చేసిన అసెంబ్లీలో తీర్మానం, కేంద్రానికి రాసిన లేఖ‌లు ఫేక్ అని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీక‌ర‌ణ ప్రక్రియను వేగ‌వంతం చేయ‌డంతో తేలిపోయింది.

ఇప్ప‌టికైనా జ‌గ‌న్నాట‌కాలు ఆపి, ఢిల్లీ వెళ్లి ప్రైవేటీక‌ర‌ణ‌ని ఆపే ప్ర‌య‌త్నాలు చేయండి.

ప‌దుల సంఖ్య‌లో ఉద్య‌మ‌కారుల ప్రాణ‌త్యాగాల‌తో ఏర్ప‌డిన విశాఖ ఉక్కుని ప్రైవేట్ ప‌రం చేయ‌డానికి స‌హ‌క‌రించిన రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా చ‌రిత్ర‌హీనులుగా మిగిలిపోతారు.

మీ ఎంపీల్ని మీ కేసుల మాఫీ లాబీయింగ్ కోసం కాకుండా, ఏపీ ప్ర‌యోజ‌నాల ప‌రిర‌క్ష‌ణ‌కి పోరాడాల‌ని ఆదేశాలివ్వండి.

నారా లోకేష్
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *