హైదరాబాద్: కొవిడ్-19 రియల్ ఎస్టేట్ మీద చాలా ప్రభావం చూపిస్తూ ఉంది. వలస కార్మికులు వూర్లకు వెళ్లిపోవడంతో మొదటి వేవ్ లో నిర్మాణ రంగం కుదేలయింది. చాలా ప్రాజక్టులు ఆగిపోయాయి. చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం (Work From Home) అవకాశం రావడం, పాఠశాలలు నిరవధికంగా మూతపడటంతో సంత వూర్లకు, తల్లితండ్రుల దగ్గరకు వెళ్లిపోయారు. ఇది గమనించి ఆంధ ప్రదేశ్ వంటి రాష్ట్రాలు వర్క్ ఫ్రం హోం కు తగ్గట్టు గ్రామీణ ప్రాంతాలలో హై స్పీడ్ ఇంటర్నెట్ అందించేందుకు చర్యలు మొదలుపెట్టాయి. ఇది వేరే విషయం.
దీనితో రెంటల్ రంగం కూడా కుదేలయింది. పెద్ద ఎత్తున ఇళ్లు ఖాళీ అయ్యాయి. కొత్త వారి వలస లేకపోవడం చాలా ప్రాంతాలలో అద్దెలకు తీసుకునే వాళ్లు కరువయ్యారు. దీనితో చివరకు చాలా కాలనీలలో యజమానులు రెంట్స్ తగ్గించుకున్నారు. రు. 30 వేల నెల సరి అద్దె వున్న ఇళ్లకు అద్దె 20 వేలకు పడిపోయింది . ఉదాహరణకు విప్రో సర్కిల్ సమీపాన ఉన్న గోపన్ పల్లెలో రు. 20వేలకు ముంచి 3BHK అద్దె లేదు. ఉద్యోగాలు పోవడం, జీతాల కోతతో కుటుంబాల రాబడి తగ్గిపోయింది. కోవిడ్ వల్ల ఇంటి ఖర్చు లు తడిసి మోపెడయ్యాయి. దీనితో కొత్త ప్లాట్ల కొనుగోళ్లు పడిపోయాయి. ఇది ఒక్క హైదరాబాద్ లో ఎదురైన పరిమాణం కాదు. దేశ వ్యాపితంగా ఉంది.
అందుకే 2021 సెకండ్ క్వార్టర్ లో అంటే ఏప్రిల్ -జూన్ మధ్య హైదరాబాద్ తో సహా దేశంలో ని ప్రధాన నగరాలలో ప్లాట్ల ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. రెసిడెన్సియల్ ఫ్లాట్స్ కొనాలనుకునేవారికి ఇపుడు మార్కెట్ అనుకూలంగా ఉంది.
హైదరాబాద్ సహా దేశంలోని 7 ప్రధాన నగరాల్లో ఈ ఏడాది ఏప్రిల్-జూన్‌లో విక్రయాలు జనవరి-మార్చితో పోలిస్తే సగటున 23% తగ్గాయని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ JLL India జరిపిన సర్వే నివేదికను ఉటంకిస్తూ బిజినెస్ స్టాండర్డ్ రాసింది.
గతేడాది ఏప్రిల్-జూన్‌తో పోలిస్తే 83% వృద్ధి కనిపించినట్లు స్థిరాస్తి సేవల సంస్థ జేఎల్‌ఎల్ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య 19,635 గృహాలు, జనవరి-మార్చిలో మొత్తం 25,583 యూనిట్లు అమ్ముడు పోవడంతో గత ఏడాది కంటే వృద్ధి కనిపిస్తుంది. గత ఏడాది ఏప్రిల్-జూన్‌లో 10,753 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయి
అయితే, ఒక్క బెంగళూరులో మాత్రం ఈసారి 3,500 యూనిట్లు అమ్ముడయ్యాయి.
హైదరాబాద్‌లో నిర్మాణాల జోరు: 2021 తొలి మూడు నెలలతో పోలిస్తే రెండో త్రైమాసికంలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు 15% పడిపోయాయి. కోవిడ్ ఆరంభమయిన రోజులతో అంటే 2020 జనవరి-జూన్‌తో అర్థ సంవత్సరంతో పోలిస్తే, 2021 జనవరి –జూన్ అమ్మకాలు 62% పెరిగాయని జెఎల్ ఎల్ నివేదికలో రాశారు.
అయితే, హైదరాబాద్ లో కొత్త నిర్మాణాలు బాగా పెరుగుతున్నాయి. 2021 మొదటి మూడు నెలల త్రైమాసికంలో 8,591 కొత్త యూనిట్ల నిర్మాణం మొదలయితే, రెండో త్రైమాసికంలో వీటి సంఖ్య విశేషంగా 10,980కి చేరింది. మొత్తం మీద హైదరాబాద్ మహానగరం నిర్మాణ రంగంలో 28 శాతం వృద్ధి కనిపించింది.
ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పుణే లలో ఇళ్ల నిర్మణాలు,క్రయ విక్రయాల తీరు ను జెఎల్ ఎల్ పరిశీలించింది. JLL India సర్వే చెప్పిన అతి ముఖ్యమయిన విషయం ఏమిటంటే, ఈ నగరాలలో రెసిడెన్సియల్ యూనిట్ల ధరలు పెరగకుండా స్థిరంగా ఉన్నాయి.
“In Q2, prices remained largely stagnant when compared to the previous quarter, across all the seven markets under the review,”అని JLL India నివేదిక పేర్కొంది. కాబట్టి ప్రాపర్టీ కొనుగోలు దారులకు ఈ నగరాలలో మార్కెట్ అనుకూలంగా ఉంది.
ఈ నివేదిక ప్రకారం బెంగుళూరులో 2021 ఏప్రిల్-జూన్ మధ్యలోె 3,500యూనిట్లు అమ్ముడువోయాయి. గత ఏడాది ఇదే కాలంలో అమ్ముడువోయిన యూనిట్లు కేవలం 2,382 మాత్రమే. అంటే 47 శాతం వృద్ధి.
చెన్నై విషాయనికి వస్తే, అక్కడ మార్కెట్ 81 శాతం పడిపోయింది. గత ఏడాది 3,200 యూనిట్ల అమ్మకాలు ఏప్రిల్ –జూన్ క్వార్టర్ లో 600యూనిట్లకు పడిపోయింది. ఢిల్లీలో 5,448 యూనిట్ల నుంచి 2,440 యూనిట్లకు (55శాతం)పడిపోయింది. ఇక హైదరాబాద్ లో అమ్మకాలు 3,709 యూనిట్ల పుంచి 3,157 యూనిట్లకు పడిపోయాయి. కోల్ కతాల్ 1,320 యూనిట్ల నుంచి 578 యూనిట్లకు అంటే 56 శాతం పడిపోయాయి. ముంబైలో అమ్మకాలు కొద్దిగా పెరిగాయి. అక్కడ గత ఏడాది 5,779 యూనిట్ల నుంచి ఈ ఏడాది 5,821 యూనిట్లకు పెరిగాయి. పుణేలో 6 శాతం పతనం ఉంది. అక్కడ గత 3,745 యూనిట్ల అమ్ముడువోతే, ఈసారి 3,539 యూనిట్లు పోయాయి.
అయితే ఈ ఏడు నగరాల అర్ధ సంవత్సరం లెక్కలు తీసుకుంటే 18 శాతం పెరుగుదల ఉంది.2020 పూర్వార్ధంలో 38,204 యూనిట్లు అమ్ముడుపోతే, 2021 మొదటి ఆరు నెలల్లో45,218 యూనిట్లు అమ్ముడుపోయాయి.
దీనికి కారణం, ఇళ్ల కొనుగోలు దారుల్లో మళ్లీ భరోసా మొదలవుతూ ఉండటమనని జెఎల్ ఎల్ పేర్కొంది.
“The sustained levels of residential sales present clear signs of demand and buyer confidence coming back to the market. The need for secured tangible assets and aspiration to own larger homes as remote working becomes the new norm is driving sales of residential properties across the country,” అని జెఎల్ ఎల్ పేర్కొంది.