నిజాం సాగర్ నుంచి నీరు విడుదల

నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి చాలా సంవత్సరాల తరువాత వానాకాలం సాగు కోసం  జులై మొదటి వారంలో నీటిని విడుదల చేయడం జరిగింది. ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు ఫలితమే. ప్రపంచంలోనే మొట్టమొదటిగా కట్టిన భారీ నీటి పారుదల ప్రాజెక్టు నిజాంసాగర్.1923-31 మధ్య మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హయాంలో ఈ ప్రాజక్టు నిర్మాణం సాగింది.ఇది తెలంగాణలో అన్నింటికంటే ముందు నిర్మించిన ప్రాజక్టు.

కానీ ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కట్టడంతో గత కొన్ని దశాబ్దాలుగా మంజీరా నదిలో నీళ్లు రాక నిజాంసాగర్ నిండలేదు. తద్వారా ఆయకట్టుకు నీరందించలేని దుస్థితి అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.

నిజాంసాగర్ మండలం లోని నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువ ద్వారా ఈరోజు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు.

ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టులో మొత్తం 7.4 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఈ నీటిని విడుతల వారీగా లక్షా 30 వేల ఎకరాలకు వర్షాకాలం పంట కోసం అందించాలనే ముఖ్యమంత్రి గారి ఆదేశం మేరకు ఈరోజు నుండి నీటిని విడుదల చేస్తున్నామని అన్నారు.

ఆయకట్టు ఆవసరాల మేరకు విడతల వారిగా నీటి విడుదల జరుగుతుంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *