మొదటిసారి స్కోర్ బోర్డును కూడా బద్దలు కొట్టిన ఘనత, రెండుసార్లు(1984,2004) ఒలింపిక్ ఆర్డర్ అవార్డు( అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ యొక్క అత్యున్నత అవార్డు), సాధించిన సంచలనం
పేరు“ నాదియా కొమనేచ్ (Nadia Comăneci)” రొమేనియా దేశానికి చెందిన చిచ్చరపిడుగు.
యావత్ ప్రపంచాన్ని అబ్బుర పరిచిన ఈ పద్నాలుగేళ్ల అమ్మాయి పేరు జిమ్నాస్టిక్ హాల్ ఆఫ్ ఫేమ్ లో పొందు పరచబడింది. 2000 సంవత్సరంలో నాదియా కొమానిచ్ ను ఈ శతాబ్దపు క్రీడాకారిణిగా ప్రకటించింది లారియస్ వర్ల్డ్ స్పోర్స్ ఎకాడమీ (Laureus World Sports Academy).
1976 మాంట్రియల్ ఒలింపిక్స్ లో సంచలనం సృష్టించిన ఈ ఐదున్నర అడుగుల బంగారం ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ లో చేసిన విన్యాసాలు చూస్తే తప్ప నమ్మలేము.
” చిన్నప్పుడు దీంతో యాక్టివ్ గా, పొంగిపొరలే ఎనర్జీతో ఉండడంవల్ల నేను ఆమెను జిమ్నాస్టిక్ క్లాసులో చేపించాను” అని చెప్పింది నాదియా తల్లి Ștefania. అంతే.
పువ్వు పుట్టగానే పరిమళించినట్లు నాదియా పట్టుమని 15 ఏళ్ళు కూడా నిండని వయసులో మాంట్రియల్ ఒలింపిక్స్ లో ఒక అద్భుతాన్ని సృష్టించింది.
ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ లో(Artistic Gymnastics) పర్ఫెక్ట్ 10 సాధించిన మొదటి క్రీడాకారిణి నాదియా నే! (ఆమె మొత్తం ఏడు సార్లు పర్ఫెక్ట్ 10 సాధించింది). మాంట్రియల్ ఒలింపిక్స్ లో ఆమె పర్ఫెక్ట్ 10 సాధించినప్పుడు స్కోర్ బోర్డు 1.0 గా చూపించింది. అందరూ ఆశ్చర్యపోయారు. అయితే అది సాంకేతికమైన పొరపాటు వల్ల అలా జరిగింది. ఎందుకంటే అంతకు ముందు ఎవరూ పర్ఫెక్ట్ 10 సాధించలేదు కాబట్టి.
చాలా కూల్ గా, ఏమాత్రం టెన్షన్ లేకుండా తన విన్యాసాలను పర్ఫెక్ట్ గా చేయడం ఆమెకే చెల్లు . అందుకే ఆమెకు “లిటిల్ మిస్ ఫర్ఫెక్ట్” అన్న బిరుదు కూడా ఇచ్చేశారు. .
ఆ విధంగా మొట్టమొదటి ఒలింపిక్స్ లోనే అద్భుతమైన ప్రదర్శన చేస్తూ all round, unevan beam, balance beam అని మూడు విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది నాదియా. మొత్తం ఒలింపిక్స్ లో ఏడు బంగారు పతకాలు సాధించిన తర్వాత 1984 లో 24 ఏళ్ళ అతి చిన్న వయసులో ఆమె జిమ్నాస్టిక్స్ నుంచి తప్పుకుంది.
క్రీడల నుంచి విరమించుకున్న తర్వాత 1984 లో ఆమె టెలివిజన్ ఆత్మకథ “నాదియా” రూపొందించబడింది. ఇంకా ఆమె పైన అనేక డాక్యుమెంటరీలు, షార్ట్ ఫిలిమ్స్ కూడా
వచ్చాయి.
అత్యున్నతస్థాయి టాలెంట్ కలిగిన ఒక క్రీడాకారిని కొన్ని కారణాల వల్ల 24 ఏళ్ల వయసులోనే తనకిష్టమైన క్రీడ నుంచి తప్పుకోవడం విషాదకరం. ఏది ఏమైనా ఒలింపిక్స్ చరిత్ర లో ఆమె పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది.