ఆదివారం పెట్రోలో, డీజిల్ మరొక సారి పెరిగాయి. దీనితో దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ లీటర్ ధర నూరు రుపాయల దరిదాపుల్లోకి వచ్చింది. దేశంలోని ఆయిల్ కంపెనీలు ఆదివారం నాడు పెట్రోల్ లీటర్ ధరని 35పైసలు, డీజిల్ ధరని 18పైసలు పెంచాయి. మే నాలుగో తేదీ నుంచి ఇప్పటివరకు ఇలా ధరలు పెరగడం 34 సారి. మే నెలలో 16 సార్లు, జూన్ లో 16 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి.
అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దాకా నెమ్మదిగా నడిచిన ధరల బండి ఎన్నికల తర్వాత ఫుల్ స్పీడ్ అందుకుంది. చూస్తుండగానే లీటర్ పెట్రోల్ ధర రు. 150 అవుతుంది. బెట్.
ఇంటర్నేషనల్ క్రూడా ఆయిల్ ధరలు తగ్గినపుడు తగ్గని ధరలు, క్రూడా ఆయిల్ ధరలు పెరిగే టపుడు మాత్రం జోరుగా పెరుగుతున్నాయ్. మే నాలుగో తేదీ నుంచి పెట్రోలు ధరలు 10.07శాతం పెరిగాయి. ఇది లీటర్ పెట్రల్ కు రు.9.11 పైసలతో సమానం. డిజిల్ కు సంబధించి 10.68 శాతం అంటే 8.63 పైసలు పెరిగింది. క్రూడాయిల్ ధర ఇదే కాలంలో 10.58 శాతం పెరిగింది. అంటే అంతర్జాతీయ స్థాయిలో భారతదేశంలో పెరుగుతున్నాయ్. ప్రజల మీద ఈ ధరల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం గాని, రాష్ట్ర ప్రభుత్వాలుగానీ భావించకపోవడమే ఆశ్చర్యం.
ఆదివారం నాటి పెరుగుదలతో ఢిల్లీ లో లీటర్ పెట్రోల్ ధర రు 99.51 పైసలు పెరిగింది. కోల్ కతాలో ఇదే ధర రు. 9945 పై లకు చేరింది. ఢిల్లీలో డీజిల్ లీటర్ ధర రు. 89.36 కాగా, కోల్ కతాలో రు 89.36 పై. ఉంది.
అనేక నగరాలలో పెట్రోలు ధర రు.100 దాటి చాలా రోజులయింది. ముంబైలో లీటర్ పెట్రోలు ధర రు. 105.58కి చేరింది. మహారాష్ట్ర, రాజస్థాన్, ఆంధ్ర, తెలంగాణ, మధ్య ప్రదేశ్, కర్నాటక, ఒదిశా, మణిపూర్, జమ్మ, కాశ్మీర్, లదాక్, పంజాబ్, బీహార్, కేరళ, తమిళ నాడు, ప. బెంగాలలలో పెట్రోల్ ధర నూరెపుడో దాటింది. డీజిల్ ధరలింకా నూరు తాకలేదు.
అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ పన్నులు విధిస్తుండటంతో భారతదేశంలో పెట్రోలు ధరలు ఆకాశాన్నంటుతున్నాయ్. ప్రపంచంలో ఏ దేశంలో ఈ పరిస్థితి లేదు.
జూలై 1 సమాచారం ప్రకారం, పెట్రోల్ ధరలో కేంద్రం విధించే టాక్స్ లు 33.29 శాతం ఉన్నాయి. రాష్ట్రాల టాక్స్ లు 23.07 శాతం. డీజిల్ ధరలో కేంద్ర టాక్స్ లు 35.66శాతం కాగా, రాష్ట్రాల టాక్స్ లు 14.62 శాతం.
2020లో అంతర్జాతీయ చమురు ధరలు బాగా పడిపోయాయి. అపుడు ఇదే వరసగా భావించిన కేంద్రం ఇంధనం మీద పన్నులను భారీగా పెంచింది రాబడి పెంచుకుంది. కేంద్రం పెంచగానే రాష్ట్రాలూ వాయించాయి. పాండెమిక్ పేరు చెప్పి ఎవరూ ఈ పన్నులు తగ్గించేందుకు సుముఖంగా లేరు.
భారత ప్రభుత్వం పెట్రోల్ ధరలను2010 , జూన్ 26న , డీజిల్ ధరలను అక్టోబర్ 14, 2014న డీరెగ్యులేట్ చేసింది. దీనితో అయిల్ కంపెనీలకు ధరలను రోజూ సవరించే స్వేచ్ఛ వచ్చింది. భారతదేశంలో వాడే ఇంధనంలో 90 శాతం వాట ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్.ఇదీ ధరల పెరుగుదల రహస్యం