కేసీఆర్, జగన్ చిల్లర డ్రామాలు. ప్రజలని రెచ్చగొట్టడానికి కుట్ర చేస్తున్న కేసీఆర్. చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి కేసీఆర్ ఆడుతున్న నాటకం జలవివాదం. ఆంధ్రాకు జల దోపిడీ చేసే అవకాశం ఇచ్చింది కేసీఅరే : అని ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్ విమర్శించారు.
ఎమ్మెల్యే రోజా ఇంటికి వెళ్లి విందు చేసి రాయలసీమ సశ్యశ్యామలం కావాలని కేసీఆర్ కోరిన మాట తెలంగాణ ప్రజలకి గుర్తుంది. జగన్ మోహన్ రెడ్డిని తప్పుపడుతున్న కేసీఆర్ 2019 ఎన్నికల్లో డబ్బులు పంపీ జగన్ గెలిపించిన మాట వాస్తవం కాదా ? జగన్ సొంత కొడుకులా చూసుకున్న కేసీఆర్ నేడు ఎందుకు ఈ డ్రామా ఆడుతున్నారు అని ఆయన ఈ రోజులు విలేకరుల సమావేశం తీవ్రంగా విమర్శించారు.
దాసోజు లేవనెత్తిని ఆసక్తికరమయిన అంశాలు:
కాళేశ్వరం కట్టడానికి వీలు లేదని అడ్డు పెట్టిన జగన్ మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లి ఇనాగిరేషన్ కి పిలిచి, ప్రాజెక్ట్ కట్టిన మంత్రి హరీష్ రావుని సైతం పక్కన పెట్టేసిన కేసీఆర్.. నేడు జగన్ తో ఎందుకు గొడవ పడుతున్నారు?
దండాలు పెట్టుకొని, స్వీట్లు తినిపించుకొని, ఆత్మీయ ఆలింగనాలు చేసుకొని జగన్ తో ఆలయ్ బలయ్ చేసుకున్న కేసీఆర్.. ఈ రోజు ఎందుకు కయ్యానికి దిగారు ?
టీఆర్ఎస్, కేసీఆర్ పరిస్థితి రోజురోజు దిగజారిపోతుంది. కొత్త టీపీసీసీ అధ్యక్షుడు వచ్చారు. తెలంగాణలో కొత్త బావోద్వేగం నెలకొంది. కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమౌతున్న తరుణంలో ప్రజల బావోద్వేగాలని మరోసారి రెచ్చగొట్టి, హుజురాబాద్ లో ఓట్లు దండుకోవాలనే చిల్లరి ప్రయత్నం చేస్తున్న కేసీఆర్ .
నేడు ఎగిరెగిరి పడుతున్న తెలంగాణ మంత్రులు గత రెండేళ్ళుగా జలదోపిడీకి జగన్ కుట్ర చేస్తుంటే గుడ్డిగుర్రం పళ్ళుతోమారా ? మొద్దు నిద్రపోయారా ? కాంగ్రెస్ పార్టీ గొడవపడమని చెప్పడం లేదు. ప్రజాస్వామ్య బద్దంగా కేసీఆర్ పోరాటం ఎందుకు చేయాలేదు. జగన్ మోహన్ రెడ్డి జల దోపిడీ చేస్తున్నారని ఒక్క రోజైన పార్ల మెంట్ లో అడిగారా ?
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్, నెట్టంపాడు, రాజీవ్ భీమా ప్రాజెక్ట్, కోయిల్సాగర్ ..2014 నాటికే యనబై శాతం పూర్తయిన ప్రాజెక్ట్స అని స్వయంగా ముఖ్యమంత్రే అసెంబ్లీలో చెప్పారు. రూ. 850కోట్లు కేటాయించినట్లయితే ఈ ప్రాజెక్ట్స్ పూర్తయ్యేవి. కానీ వీటిని పూర్తి చేయలేదు. జగన్ కి జల దోపిడీ చేసే అవాకాశం ఇచ్చింది కేసీఅరే.
విభజన చట్టం ప్రకారం జల పంపిణీకి సంబధించి కొత్త ట్రబ్యునల్ ని ఏర్పాటు చేసుకునే అవకాశం వుంది. కానీ ఏడేళ్ళుగా కృష్ణా ట్రబ్యునల్ ని ఏర్పాటు చేయడంలో కేసీఆర్ ఎందుకు విఫలమయ్యారు? బిజెపితో కుమ్మక్కయ్యారా ? మోడితో తలపడాలంటే భయమా ? చేతకాకపొతే చేతులెత్తేసినట్లు కేసీఆర్ ప్రజలకు చెప్పాలి.