రాఫేల్ అనే మాటను భారతీయులంతా మర్చిపోయి ఉంటారు. ఎందుకంటే, ఫ్రాన్స్ కు చెందిన Dassault Aviation నుంచి కొనుగోలు చేసిన రాఫేల్ యుద్ధ విమానాలు బాగా ఆకాశంలో ఎగిరాయి, వాటి నుంచే పాకిస్తాన్ లో సర్జికల్ స్ట్రైక్ జరిగింది కాబట్టి , వాటి కొనుగోలులో అవినీతి, బంధుప్రీతి, మానీ లాండరింగ్ ఉందనడం దేశద్రోహం అవుతుంది. అందువల్ల రాఫేల్ అనే మాట ఉచ్ఛరించడానికి ఎవరూ సాహసించడం లేదు.
దీనికితోడు, భారతదేశంలో ఈ యుద్ధవిమానాల కొనుగోలుకు సంబంధించి జరిగిని విచారణలన్నీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇచ్చాయి. దానితో ఆ చాప్టర్ క్లోజ్ అయింది.
ప్రాన్స్ యుద్ధ విమానాలు కొనుగోలు చేయడంలో అవినీతి అక్రమాలు జరిగాయని భారతదేశం ప్రతిపక్ష పార్టీలు గోల చేయడం మానేశాయి. విచారణ డిమాండ్ కు అవకాశం లేకుండా పోయింది. కోర్టు తీర్పులతో ఇక్కడ ఆ రగడ చల్లబడింది.
రాఫేల్ యుద్ధవిమానాల డీల్ లో అవినీతి, అనిల్ అంబానీ కంపెనీ పాత్ర చర్చనీయాంశం కాకుండా మరుగున పడింది. కానీ, ఫ్రాన్స్ లో కథ అడ్డం తిరిగింది.
ప్రాన్స్ లో ఇపుడు రాఫేల్ మళ్లీ భగ్గున మండింది. రాఫేల్ యుద్ధవిమానాల కొనుగోల్ డీల్ మీద విచారణ జరిపించేందుకు ఒక ఫ్రెంచ్ న్యాయమూర్తి విచారణకు ఆదేశించారు. భారత ప్రభుత్వం 7.8 బిలియన్ యూరోలతో రాఫేల్ యుద్ధవిమానాలు కొనుగోలు చేసింది. ఈ డీల్ అవినీతి ఉందని, బంధుప్రీతి జరిగిందని ఆరోపణలున్న సంగతి తెలిసిందే.
ఫ్రెంచ్ ప్రభుత్వ న్యాయవిచారణ నిర్ణయాన్ని మీడియాపార్ట్ (mediapart) అనే ఫ్రెంచ్ వెబ్ సైట్ వెల్లడించింది. ఈ వెబ్ సైట్ కు చెందిన ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్ యాన్ ఫిలిప్పిన్ ఈ విషయం వెల్లడించారు.
ఫ్రెంచ్ పబ్లిక్ ప్రాసిక్యూషన్స్ సర్వీసెస్ కు చెందిన ఫైనాన్సియల్ క్రైమ్స్ బ్రాంచ్ నిర్ణయం తర్వాత 2016 లో కుదిరిన రాఫేల్ డీల్ న్యాయవిచారణ కు ఆదేశించాలని జూన్ 14నే నిర్ణయించారని ఫిలిప్పిన్ రాశారు.
మీడియాపార్ట్ జర్నలిస్టు ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ద వైర్ (The Wire ) భారత ప్రజల కోసం Setback for Modi , Macron as French Judge Opens Criminal Investigation into Rafale Deal With India అని ఒక కథనం ప్రచురించింది.
భారత్, ఫ్రాన్స్ ఒప్పందం ప్రకారం ఈ డీల్ లో బ్రోకర్లకు పాత్ర లేదు. అయితే, బ్రోకర్లు ప్రవేశించారని, భారీ గా కమిషన్లు కొట్టేశారని ఫిర్యాదు లొచ్చాయి.
ఈ విషయం భారత్ ఎన్ ఫోర్స్ మెంటు అధికారులకు తెలిసినా దాని మీద విచారణ జరపలేదు. ఇందులో అవినీతి ఉంది, ఆశ్రిత పక్షపాత ఉంది, చట్ట వ్యతిరేక టాక్స్ మినహాయింపులున్నాయిని ఫ్రాన్స్ కు చెందిన అవినీతి వ్యతిరేక ఎన్ జీవొ షెర్పా (Sherpa) పారిస్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేసింది.
కొత్తగా మొదలయిన న్యాయవిచారణ నాలుగు అంశాల మీద దృష్టికేంద్రీకరిస్తుంది. అవి: మనీ లాండరింగ్ (Money Laundering), పేవరేటిజమ్ (Favouristism), పలుకుబడితో వత్తిళ్లు తీసుకురావడం(Influencce Peddling), అసంబద్ధ టాక్స్ మినహాయింపులు (undue tax waivers).
ఈ డీల్ లో అనిల్ అంబానీ గ్రూప్ మధ్యవర్తిగా పనిచేసిందని మీడియా పార్ట్ స్పష్టంగా రాసింది. 36 యుద్ధ విమానాలను ఫ్రాన్స్ కంపెనీ నుంచి భారతదేశం కొనుగోలుచేస్తుందని ప్రధాని మోదీ పారిస్ ప్రకటించడానికి రెండు వారాల ముందున మార్చి 26, 2015 Dassault Aviation తో అనిల్ అంబానీ గ్రూప్ ఒక ఒప్పందం (MoU) కుదుర్చుకుంది.