ఒకపుడు దేశంలోని కోవిడ్ నగరాలలో ఒకటై పోయిన బెంగళూరు కోవిడ్ ను దాదాపు జయించింది. కర్ఫ్యను మొత్తంగా ఎత్తేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
కోవిడ్ కేసులు బాగా తగ్గిపోవడంతో రాత్రి కర్ఫ్యూ తో పాటు వారాంతపు కర్ఫ్యూ ని కూడా ఎత్తేయాలని బెంగళూరు అధికారులు చూస్తున్నారు. ఈ విషయాన్ని బిబిఎంసి కమిషనర్ గౌరవ్ గుప్తా వెల్లడించారు. బెంగళూరులో పాజిటివిటి రేటు ఒకశాతం కంటే తక్కువకు పడిపోయింది. నగరంలో రోజూ 65 వేల కోవిడ్ పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ 70 వేలనుంచి 80 వేలమందికి వ్యాక్సిన్ ఇస్తున్నారు. అందువల్ల రాత్రి కర్ఫ్యూ, వారాంతపు కర్ఫ్యూ ఎత్తేయాలని భావిస్తున్నట్లు గుప్తా తెలిపారు. ప్రస్తుతం మునిసిల్ అధికారులతో చర్చలు నడుస్తున్నాయని, తర్వాత ముఖ్యమంత్రి యదియూరప్ప దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళతామని ఆయన చెప్పారు. ఆపైనప్రభుత్వం నిర్ణయం ప్రకటిస్తుందని అన్నారు. ఇప్పటికే వర్తక వాణిజ్య సంస్థలు కర్ఫ్యూ ఎత్తేయాలని కోరుతున్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.