శ్రీవారి హుండీ ఆదాయం తగ్గినపుడు ప్రైవేటు ఏజన్సీకి నిధులిస్తారా?

తిరుమలలోకి ప్రైవేటీకరణ ప్రవేశిస్తుండటం పట్ల కాంగ్రెస్ నేత, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్, INTUC జిల్లా గౌరవ అధ్యక్షులు నవీన్ కుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

లడ్డు కౌంటర్, కళ్యాణకట్ట, అలిపిరి, తిరుమల టోల్ గేట్ చెకింగ్ పాయింట్ తో సహా సుమారు 17 ప్రాంతాలలో 430 మంది సిబ్బంది కొరకు KVM ప్రైవేట్ ఏజెన్సీకి అప్పజెప్పడం మీద ఆయన అభ్యంతరం చెప్పారు.

అసలే  తిరుమల గుడి ఆదాయం తగ్గినపుడు, భక్తుల సంఖ్య పడిపోయినపుడు ప్రయివేటు సంస్థతో కాంట్రాక్టు చేసుకోవడం అనుమానాలనకు తావిస్తున్నదని ఆయన అన్నారు.

ఈ వ్యవహారం పై రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ విచారణ ఆదేశించాలని ఆయన ఈ రోజు డిమాండ్ చేశారు.

స్పెసిఫైడ్ అథారిటీ “అడ్డగోలు” నిర్ణయాలకు అడ్డుకట్ట వేయాలని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర్మకర్తల మండలి ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.

శ్రీవారి దర్శనానికి కరోనా కారణంగా భక్తుల సంఖ్య తగ్గడంతో హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది.  టిటిడి వివిధ విభాగాలలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది,శ్రీవారి సేవకుల సహకారంతో భక్తుల రద్దీ పెరిగే వరకు లడ్డు కౌంటర్ లలో ఎందుకు వినియోగించుకోకూడదు!

శ్రీవారి దర్శనానికి రద్దీ తక్కువ ఉన్న సమయంలో ఓ ప్రైవేటు ఏజెన్సీ కి నెలకు రు. 5 కోట్ల రుపాలయలతో కాంట్రాక్టు కట్టబెట్టడంలోని ఆంతర్యం ఏమిటి? అని ఆయన ప్రశ్నించారు.

నవీన్ కుమార్ రెడ్డి

ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మల్టీ నేషనల్ కంపెనీలు సైతం తమ సంస్థలో పనిచేసే ఉద్యోగస్తులను”వర్క్ ఫ్రం హోం” పేరుతో దుబారా ఖర్చులను(మెయింటెనెన్స్ ఖర్చులు) తగ్గించుకుంటున్నాయి. మరి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ ఎందుకు అలా ఆలోచించడం లేదు!

టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ జాతీయ బ్యాంకు అధికారులతో చర్చించి గతంలో ఏ విధంగా లడ్డు కౌంటర్ లలో బ్యాంకు జీతాలతో ఔట్ సోర్సింగ్ సిబ్బంది పని చేస్తున్నారో అలా చేసే ప్రయత్నం ఎందుకు చేయడం లేదు!

టీటీడీ లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి ప్రైవేట్ ఏజెన్సీ వారు సెక్యూరిటీ డిపాజిట్ ల పేరుతో లక్షల్లో వసూలు చేస్తున్నారని, దీనిపై విజిలెన్స్ విచారణ జరపి నిరుద్యోగులు మోసపోకుండా చూడాలని
నవీన్ కుమార్ రెడ్డి కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *