హుజూరాబాద్ ఉపఎన్నికకు జగన్ సాయం, అందుకే మౌనం: దేవినేని ఉమ

తెలంగాణ మంత్రులు తనని, తండ్రిని తిడుతున్నా తాను మౌనంగా ఎందుకున్నాడో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన వివరణ బాగా విమర్శ ఎదుర్కొంటుంది. రాజకీయ పరిశీలకులు, పార్టీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ కు ఈ మధ్య బాగా అపకీర్తి తెచ్చిన వైఖరి ఇది.

ఆంధ్రప్రదేశ్ వాడుకుంటున్న కృష్ణాజలాల మీద తెలంగాణ చేస్తున్నదాడి మీద ముఖ్యమంత్రి జగన్ ఇచ్చుకున్న సంజాయిషీ ‘నువ్వు కొట్టినట్టు ఉండాలి.. నేను ఏడిసి నట్టు ఉండాలి’  అనే లాగా ఉందని తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించారు.

జగన్ మౌనం వెనక ఉప ఎన్నికల ఒప్పందం ఉందని ఉమామహేశ్వరరావు ఆరోపించారు.

ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న ఆంధ్రుల భద్రత కోసమే తాను తెలంగాణ ప్రభుత్వాన్ని, మంత్రులను ఏమీ అనలేక పోతున్నాన్న వాదనను ఖండించారు.

హుజూరాబాద్ ఉప ఎన్నికల ఒప్పందం లో భాగంగా ఈ డ్రామాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.

17.05.2016 కర్నూలులో తెలంగాణకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి జగన్ జలదీక్ష చేపట్టిన విషయం గుర్తుచేస్తూ  జల దీక్ష చేసినప్పుడు పక్క రాష్ట్రంలో మన తెలుగు వారు ఉన్నారు, వారికి భద్రత ఉండాలి అనే విషయం గుర్తురాలేదా అని ఆయన ప్రశ్నించారు.

అక్కడ మంత్రులు మాట్లాడుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదు?

దేవినేని ఇంకా ఏమర్నారంటే…

ఇదే చూడండి .. 40 ఏళ్ల అనుభవానికి ఒక తెలివితక్కువ ప్రభుత్వానికి ఉన్న తేడా

మేము పట్టిసీమ కట్టాము. మచ్చుమర్రి కట్టి హంద్రీనీవా ద్వారా నీళ్లు ఇచ్చాము.

చంద్రబాబు పట్టిసీమ కట్టాడు కాబట్టి పట్టిసీమ నీళ్లు కృష్ణమ్మకు తీసుకురాలేదు

పక్క రాష్ట్రంలో మన తెలుగువారు ఉన్నారంటా !

200 టీఎంసీల అక్రమ ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతుంది ఎందుకు మాట్లాడడం లేదు ?

అధికారంలోకి రాగానే పక్క రాష్ట్రం ముఖ్యమంత్రిని కలిసి లక్షల కోట్లు ఖర్చు పెట్టి పక్క రాష్ట్రం నుంచి గోదావరి నీళ్లు తీసుకు వస్తానన్నావు ఏమైంది ?

అసెంబ్లీలో చంద్రబాబు గారు చెబితే విన్నారా ?

పక్క రాష్ట్రంలో మంత్రులు ఆ విధంగా మాట్లాడుతున్నా నోరు మూసుకొని కూర్చున్నారు

బుద్ది జ్ఞానం ఉంటే ఈ నీళ్లు సముద్రంలోకి కాదు కాలువలోకి పంపించండి

రెండు రాష్ట్ర ప్రభుత్వాలది మూర్ఖత్వం, తెలివితక్కువ తనం బాధ్యతారాహిత్యం

నారు మళ్లకు వెళ్ళాల్సిన నీళ్లు ముద్రంలోకి వడాలదనికి మీకు మనస్సు ఎలా వచ్చింది?

 

ఇలాంటి సమస్య గతంలో వస్తే గవర్నర్ గిరి దగ్గర పంచాయతీ పెట్టి 512 టీఎంసీల, 278 టీఎంసీల తెలంగాణ కు మినిట్స్ రాసుకొని సంతకాలు పెట్టాము

గతంలో కృష్ణా రివర్ బోర్డు పంపకాలు చేసింది

సాక్షి పత్రిక లో చాలా చక్కగా నీటి పంపకాలు ఇచ్చారు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *