తహాసిల్దార్ కార్యాలయం గుమ్మానికి పుస్తెల తాడు కట్టి నిరసన తెలిపిన మహిళ… రాజన్నసిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఘటన. ఆమె రోధిస్తూ ఏంచెబుతున్నదో వినండి. తెలంగాణ లో పాతుకుపోతున్న అవినీతి పాలనకు ఇది సాక్ష్యం.
జరిగిందేంటంటే
రుద్రాంగి మండలం మానాల గ్రామానికి చెందిన పొలాస రాజేశం మంగ కు సర్వే నెంబర్ 130/14 లో 2 ఎకరాల భూమి ఉంది. భర్త రాజేశం మూడు సంవత్సరాల క్రితం చనిపోయాడు. దీనితో ఈ భూమిని వేరే వాళ్ళకి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది పట్టా చేశారు. ఇది తన భూమి అని తనకే పట్టా చేయాలని మూడు సంవత్సరాలుగా ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూ ఉంది మంగ. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. లంచం కోసమే అధికారులు ఇలా చేశారని భావించి ఆమె తన మంగళసూత్రాన్ని లంచంగా ఇచ్చేందుకు సిద్దమయింది.
తన తాళిబొట్టు తీసి ఆఫీస్ గెట్ కి వేలాడదీసి దీనిని లంచంగా తీసుకుని భూమిని తనకు పట్టా చేయాలని ఆవేదన రోధించింది.
మంగ మెటపల్లి లో ఉంటున్నది. దీనిని అదనుగా తీసుకుని ఎవరో భూమిని కాజేసే ప్రయత్నం చేశారని, దీనికి అధికారులు కూడా సహకరించారని ఆవేదన వ్యక్తం చేసింది
భర్త లేని తనకు ఈ భూమియే జీవనాధారమని, దానిని లాక్కోవద్దని ఆమె అధికారులను కోరుతూ ఉంది.
ఇవి కూడా చదవండి