కొవిడ్-19 మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం చెల్లించాలని బుధవారం సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్చునిచ్చింది. కోవిడ్-19 మహమ్మారిని జాతీయ విపత్తుగా గుర్తించి, నివారణను జాతీయ విప్తులు చట్టం ప్రకారం చేపట్టినందున బాధితులందరికి ఈచట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే నని కోర్టు తీర్పు చెప్పింది. దీని వల్ల రాష్ట్రాలు కూడా కోవిడ్ మృతులకు, ఇతర బాధితులకు పరిహారం చెల్లించాల్సి వస్తుంది. పరిహారం చెల్లింపులో కోవిడ్ డెత్ సర్టిఫకేట్ కీలకమయింది కాబట్టి, ఈ సర్టిఫికేట్ జారీ చేయడాన్ని సరళతరం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది.
జాతయ విపత్తుల సంస్థ అనేది ఒక చట్టబద్ధమయిన సంస్థ కాబట్టి నష్టపరిహారానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే పని ఈ సంస్థే ప్రారంభించాలని కూడా సుప్రీం కోర్టు తెలిపింది.ఈ మార్గదర్శకాలను రూపొందించడానికి ఆరు వారాల గడువు విధించింది.
ఏదేని ఒక జాతీయ విపత్తు వచ్చినపుడు బాధితులకుటుంబాలకు కనీసం ఎంత పరిహారంచెల్లించాలనే విషయం జాతీయ విపత్తు చట్టం (Disater Management Act)లోని సెక్షన్ 12 స్పష్టం చేసిందని కోర్టు గుర్తు చేసింది. సెక్షన్ 12 (iii) ప్రకారం ఇందులో ఎక్స్ గ్రేషియా మొత్తం కూడా ఉంటుంది.
సెక్షన్ 12 అనేది శిరోధార్యం కాదన్ని కేంద్ర ప్రభుత్వం చేసిన వాదనని కోర్టు తోసిపుచ్చింది. సెక్షన్ 12లో తప్పనిసరిగా అనేమాట (Shall) ఉందని, అందువల్ల ఈ నియమం శిరోధార్యమేనని కోర్టు స్పష్టం చేసింది.
అయితే,ఎత్త మొత్తంచెల్లించాలనే విషయాన్ని తాము నిర్ణయించలేమని, దానిని జాతీయ విఫత్తుల సంస్థకు వదిలివేస్తున్నామని కోర్టు చెప్పింది.
ఆరువారాలలో ఈ సంస్థ పరిహారానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించాలని కోర్టు ఆదేశించింది. తీర్పులోని కొన్ని భాగాలాను జస్టిస్ ఎం ఆర్ షా చదవి వినిపిస్తూ, జాతీయ విపత్తుల సంస్థ నష్టపరిహారం చెల్లించాలని సిఫార్సు చేయడంలో విఫలమయిందని కూడా కోర్టు వ్యాఖ్యానించింది.
There is a duty cast on the national authority toprescrige minimum standards of relief … there is nothing on record that National Authoriy has issues any guidelines for minimum standards of relief for Covid victims, which shall include ex-gratia assistance to COVID… The national authority has failed to perform its statutoray duty under section 12 by failing to recommend minimum relief for ex-gratia assistance అని కోర్టు జాతీయవిపత్తుల సంస్థ మీద చరకు వేసింది.
ప్రభుత్వానికి ఆర్థికసమస్యలున్నాయని, కోవిడ్ బాధితులకు పరిహారం చెల్లించడం భారమవుతుందని, అందుకే తాము పరిహారం నిర్ణయించకుండా జాతీయ కమిషన్ ను ఆదేశిస్తున్నామని కోర్టు పేర్కొంది.
“No country or state has unlimited resources. Dispensation of the same is based on a number of circumstances and facts. Therefore ,we don’t think it is proper to direct the Union to pay a particular amount. This is to be fixted by the government. Ultimately,the priorities are also to be fixed by the government,”అని కోర్టు పేర్కొంది.
నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించినందున కోవిడ్ మృతులకు మరణ ధృవీకరణ సర్టిఫికేట్లు ఇచ్చేందుకు సూక్షంగా నియమాలు రూపొందించాలని కోర్టు సూచించింది.
కోవిడ్ వల్ల మరణించిన ప్రతిఒక్కరికి పిటిషనర్ కోరినట్లు రూ.4లక్షలు చెల్లించలేమని కొద్ది రోజుల క్రితం కేంద్రం కోర్టుకు తెలిపిన సంగతి తెలిసిందే.
గౌరవ్ కుమార్ బన్సల్, , రీపక్ కన్సల్ లు వేసి పిటిషన్ ల జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిష్ ఎం ఆర్ షాల ధర్మాసనం విచారణ జరిపి ఈ తీర్పు ఇచ్చింది.