వైఎస్ రాజశేఖర్ రెడ్డి నీటి దొంగయితే, జగన్మోహన్ రెడ్డి గజదొంగ అని తెలంగాణ మంత్రులు చేస్తున్న క్యాంపెయిన్ మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించలేదు.
నిజానికి దీనిని ఆంధ్రామంత్రులు కూడా పెద్ద స్పందించలేదు. అయితే, తెలంగాణ మంత్రులు ఒకరి తర్వాత దీనిని మీద స్వరం పెంచుతున్నారు.
తన మీద, తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద వ్యక్తిగత దూషణలకు దిగుతున్నా జగన్ ఎందుకు స్పందించడం లేదు?
దీనికి ఆయన ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో క్లారిఫికేషన్ ఇచ్చారు.
‘ రాయలసీమ ఎత్తి పోతల ప్రాజక్టుకు సంబంధించి తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ చాలా మంది ప్రజలున్నారని ఆలోచిస్తున్నాను. ఎపి వాళ్లను ఇబ్బంది పెడతారనే ఎక్కువగా నేను మాట్లాడట్లేదు. ఏపీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ఎలా ఊరుకోవాలి? తెలంగాణ మంత్రులు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు
జల వివాదాలపై ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించి మంత్రులు కూడా సూచనలివ్వాలి.శ్రీశైలం ఎడమ పక్క జలవిద్యుత్కేంద్రం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి నిలిపివేయాలని మరోసారి లేఖ కృష్ణ నది బోర్డు (KRMB)లేఖ రాయాలి..నీటి వినియోగంపై కేఆర్‌ఎంబీకే కాకుండా ప్రధానికి కూడా లేఖ రాయాలి,’ అని జగన్ అన్నట్లు సమాచారం.