కరీంనగర్ సిగలో తీగల మణిహారం సిద్దమవుతూ ఉంది. కేబుల్ బ్రిడ్జీ పనులు తుదిదశకు చేరుకున్నాయి. దీనికి సంబంధించి త్వరలో అప్రోచ్ రోడ్లకు భూసేకరణ జరుగుతుంది. శరవేగంగా అభివృద్ది చెందుతున్న కరీంనగర్లో ఆధునాతన సాంకేతికతతో తీగల వంతెన ఒక ప్రత్యేకఆకర్షణ కానుంది. ప్రస్తుతం లోడ్ టెస్టింగ్ పనులుకొనసాగుతున్నాయి. ఐదు రోజుల పాటు కొనసాగుతాయి. వంతెన పై 28 టిప్పర్లలో 840 టన్నుల ఇసుక, ఫుట్ పాత్ ల పై మరో 110 టన్నుల ఇసుకను ఉంచి సామర్ద్యాన్నిఅధికారులు పరీక్షిస్తున్నారు. మానేర్ నది మీద లోవర్ మానేర్ డ్యామ్ కు దిగువన ఈ బ్రిడ్జి నిర్మాణం సాగుతూ ఉంది.
వంతెన పై ఇరువైపుల 28 టిప్పర్లను నిలిపి… ఒక్కో టిప్పరులో 30 టన్నుల బరువు ఇసుకు ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. మొత్తం 840 టన్నుల ఇసుక బరువుతో పాటు… వంతెన ఇరువైపులా ఫుట్ పాత్ ల పై 110 టన్నుల ఇసుక సంచులను వెశారు. వంతెన పై మొత్తం 950 టన్నుల బరువును ఉంచి… వంతెన కింద 17 ప్రాంతాల్లో సెన్సార్లను ఉంచి… 24 గంటల పాటు పరీక్షించనున్నారు. ఇలా శనివారం వరకు పరిశీలన చేసి… ఆదివారం సెలవు ఇవ్వనున్నారు. మళ్ళీ సోమ, మంగళవారాల్లో 20 వాహనాల్లో ఇసుకను నింపి… ఫుట్ పాత్ ల పై ఇసుక బస్తాలు పెట్టి… మళ్ళీ వంతెన సామర్ధ్యాన్ని అంచనా వేయనున్నారు. పరిశీలన మొత్తం పూర్తయ్యాకా… ఏమైన సమస్యలు దృష్టికి వస్తే తీసుకోవల్సిన చర్యలు చేపట్టనున్నారు.
సర్వాంగ సుందరంగా ముస్తాబైన కేబుల్ బ్రిడ్జికీ… ఆదునాతనమైన లైటింగ్ మరింత శోభను తీసుకురానున్నారు. 8 కోట్ల రూపాయలతో రాత్రి వెళల్లో పర్యాటకులను అలరించే విధంగా… తీగల వంతెన పై రంగు రంగుల డిజిటల్ లైటింగ్… ఇతర ఆకర్షణీయ పనులను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలను సిద్దం చేసి ప్రభుత్వానికి పంపించారు. ప్రతిపాదనలు ఆమోదం పొందిన వెంటనే… ఆ పనులను కూడా త్వరితగతిన చేపట్టి… పూర్తి చేయనున్నారు.
ఇప్పటికే మానేర్ రివర్ ఫ్రంట్ కోసం పాలకులు 410 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో… ఎమ్మారెఫ్ నిర్మాణం పనులు వేగవంతం కానున్నాయి.
బిసి సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో అధికారులు చురుకుగా పనులను నిర్వహిస్తున్నారు.