కోవిడ్-19 కారణంగా ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం అమర్ నాథ్ యాత్ర ను రద్దు చేసింది. అమర్ నాథ్ యాత్ర ఇలా రద్దుకావడం వరుసగా ఇది రెండో సారి. అయితే, హారతి,పూజలను ఆన్ లైన్ లైన్ లో తిలకించే భాగ్యం జమ్మ కాశ్మీర్ ప్రభుత్వం కల్పిస్తున్నది. వర్చవల్ పద్ధతిలో హారతి,పూజలను ప్రసారం చేయాలని ఆలయం బోర్డు నిర్ణయించింది.
ఆరతి పట్టి, పూజ చేసేందుకు కొంతమంది సాధువులను అనుమతిస్తున్నారు. వారుకూడా కోవిడ్ నిబంధనలను పాటించాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. యాత్రికులు రాకపోయినా, సాంప్రదాయికంగా చేసేే పూజలన్నింటిని నిర్వహిస్తారు. ప్రతిరోజు ఉదయం ఆరు నుంచి ఆరున్నర దాకా, సాయంత్రం 5 నుంచి 5.30 దాకా హారతి భక్తులు హారతి తిలకించవచ్చు. అమర్ నాధ్ జీ వెబ్ సైట్, యాప్ లతో పాటు MH1 Prime లో హారతి ని తిలకించవచ్చు.
హారతి,పూజలను సుమారు ఆరగంట సేపు నిర్వహిస్తాారు. జూన్ 28 నుంచి ఆగస్టు 22 దాకా ఈ కార్యక్రమం ఆన్ లైన్ ప్రసారమవుతుంది.
సాధారణంగా ప్రతిఏడాది జూన్ 28 న యాత్ర మొదలవుతుంది. ఇది 56 రోజుల పాటు సాగుతుంది. ఆగస్టు 22న రక్షాబంధన్ రోజున ముగుస్తుంది. జమ్ము కాశ్మీర్ లెఫ్టినెంట్ జనరల్ యాత్ర ను రద్దు చేస్తున్నట్లు ట్వీట్ చేశారు.అయితే నామమాత్రంగా యాత్ర సాగుతుంది. అమర్ నాథ్ గుహ వద్ద సాంప్రదాయికంగా పూజలు నిర్వహిస్తారని ఆయన తెలిపారు.
“ప్రజలజీవితాలను భద్రత కల్పించడమనేదిచాలాముఖ్యం. అందువల్ల ఈ సారి అమర్ నాథ్ యాత్ర నిర్వహించడం ప్రజాప్రయోజనాలరీత్యా అభిలషణీయం కాదు, అని లెఫ్టినెంట్ గవర్నర్ పేర్కొన్నారు. యాత్రను అనుమతించాలా వద్దా అనే విషయం మీద శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. అపుడే ఈ నిర్ణయం తీసుకున్నారు.