నేడు రేపు తెలంగాణలో వర్షాలు

ఇంకా ఉక్కపోతతో మగ్గిపోతున్నతెలంగాణ ప్రజలకు హైదరాబాద్ వాతావరణకేంద్రం కొద్దిగా చల్లటి వార్త తెలిపింది.  తెలంగాణాలోని చాలా జిల్లాలలో ఒకటి రెండు ప్రదేశాలలో భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు ఉత్తర తెలంగాణా జిల్లాలలో ఒకరి రెండు ప్రదేశాలలో భారీ వర్షాలు వచ్చే అవకాశం వుంది.

ఇక  రాగల 2 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకటి, జిల్లాలలో వచ్చే అవకాశం ఉంది.

ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టం నుండి 4.5 కిమి వరకు వ్యాపించి ఉంది. మరొక ఆవర్తనం ఉత్తర ఛత్తీస్ గడ్ &పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 3.1 కిమీ వరకు వ్యాపించి ఉంది.

 

దీనితో  ఈ రోజు ,రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
చాలా ప్రాంతాల పడవచ్చు. ఇక ఎల్లుండి కొన్ని ప్రదేశాలలో వర్షాలు కురిసేఅవకాశం ఉంది.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *