తెలంగాణ దళితులు సాధీకారీకరణ కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ఈ రోజు ప్రగతి భవన్ లో అఖిలపక్షసమావేశం ఏర్పాటు చేశారు.
దళితుల కోసం గత ఏడేళ్లలో ఆయన చాలా ప్రకటనలు చేసినా, తొలిసారి ఇలా అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు. సాధారణంగా ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రతిపక్షాన్ని, ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీలను గుర్తించరు. ఇపుడు తొలిసారి ఆయన దళితులకోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
దళితుల అభ్యున్నతి అనేది సమిష్టి కార్యక్రమం అని, దీనికోసం అంతా కలసి కట్టుగా పనిచేయాలని అన్నారు. ఇలా ముఖ్యమంత్రి కెసిఆర్ ఇతర రాజకీయ పార్టీలను కలుపుకుని పోవాలనుకోవడం తెలంగాణలో కొత్త పరిణామం.
ఇతర రాజకీయ పార్టీలు ఆయనను కలుసుకుని వనతి పత్రం సమర్పించడం కూడా కష్టమనే విమర్శ వినబడుతూ ఉంటుంది. మొన్నటికి మొన్న మాజీ ఎంపి, మాజీ మంత్రి కాంగ్రెస్ నేత వి హనుమంతరావుకు అప్పాయంట్ మెంటు దొరకక తాను తెచ్చిన వినతి పత్రాలన్ని సెక్యూరిటీ సిబ్బందికి సమర్పించి వెళ్లారు.
ఇలాంటి ముఖ్యమంత్రి ఇపుడు ఆఖిల పక్ష సమావేశం ఏర్యపాటు చేయడం ఆశ్చర్యం.
అంతేనా, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దళితులే పీడిత వర్గాలు అని కెసిఆర్ అన్నారు. ఎస్సీల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏం చేయాలో సూచించాల్సిందిగా ముఖ్యమంత్రి పమావేశానికి వచ్చిన వారిని కోరారు.
దళితులకు సామాజిక, ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే ఏం చేయాలో దశలవారీగా కార్యాచరణ చేపడదామని తాము కూడా పురోగమించగలం అనే ఆత్మవిశ్వాసం దళిత సమాజంలో కల్పించడం చారిత్రక అసవరమమని కెసిఆర్ అన్నారు.
అందుకే ఇది చారిత్రాత్మకం.
సమాజాభివృద్ధిలో ప్రభుత్వాలదే కీలక పాత్ర అని ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే రేపటి తరాలు నష్టపోతాయని ఆయ సమావేశంలో ప్రకటించారు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీల బాధలు పోవాలని అన్నారు. ఎస్సీల అభివృద్ధి కోసం దశల వారీగా కార్యాచరణ అమలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఒకవిధంగాత ఆయన ఈ రోజు తెలంగాణ దళితుల అభ్యున్నతి కోసం ఆయన దళిత మ్యానిఫెస్టో ప్రకటించారు.దీనిని తక్షణం అమలు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
దళిత అజండాలోని ప్రధానాంశాలు
* తెలంగాణ దళిత సమాజం వద్దనున్న వ్యవసాయ భూమిని గణన చేయాలి. లెక్కలను స్థిరీకరించి ఒక సమగ్ర నివేదికను అందజేయాలి.
* అవసరమైతే పది పదిహేను రోజులు దళితుల భూముల గణన మీదనే ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలి
* దళితుల అభివృద్ధి కోసం సామాజికంగా, ఆర్థికంగా చేపట్టాల్సిన కార్యాచరణను ప్రత్యకంగా విడివిడిగా సిద్ధం చేసుకోవాలి.
* 35 వేల నుంచి 40 వేల కోట్ల రూపాయలు బడ్జెట్ సమకూర్చి, దళిత సాధికారత కోసం ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధం ఉంది. ఇది సమిష్టి కార్యాచరణ. అందరం కలిసి చేపట్టాలె.
* ప్రాజెక్టులు తదితర ప్రజా వసరాల కోసం భూసేకరణలో భాగంగా సేకరించాల్సి వచ్చిన అసైన్డ్ భూములకు కూడా, పట్టా భూములకు చెల్లించిన ఖరీదునే ప్రభుత్వం చెల్లించాలి.
* ఎటువంటి బ్యాంక్ గారెంటీ జంజాటం లేకుండానే దళితులకు సహకారం అందిస్తాం.
* అద్దాల అంగడి మాయా లోకపు పోటీ ప్రపంచం లో, ఉపాధి అవకాశాలను అంది పుచ్చు కోవడానికి, దళిత బిడ్డలు తమ నైపుణ్యాలను, సామర్థ్యాలను పెంచుకోవాలి.దీనిని అవసరమయిన సహాకారాన్ని ప్రభుత్వం అందిస్తుంది.
సమావేశానికి బిజెపినాయకుడు మెత్కుపల్లి నరసింహులు కూడా హాజరయ్యారు. ఆయన ముఖ్యమంత్రిని తెగ ప్రశసించారు.