కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన స్మార్ట్ సిటీ అవార్డ్ టెస్ట్ తిరుపతి పట్టణానికి అవార్డులు లభించాయి. శానిటేషన్, సోషల్ యాస్పెక్ట్ లలో తిరుపతి మొదటి శ్రేణిలో నిలబడింది. అర్బన్ ఎన్విరాన్ మెంట్ క్యాటగరీలో మూడో స్థానంలో ఉంటే, ఎకానమీ లో రెండో స్థానంలో ఉంది.
తిరుపతి పలు అంశాలలలో రాష్రాల రాజధానుల సరసన నిలబడటం విశేషం. ఉదాహరణకు సోషల్ యాస్పెక్ట్స్ లో తిరుపతి భవనేశ్వర్, తుమకూరు (కర్నాటక)లతో ఉంది.
అర్బన్ ఎన్విరాన్ మెంట్ లో తిరుపతి నగరం చెన్నై, బోపాల్ తో ధీటుగా ఉంది.
శానిటేషన్ లో తిరుపతి నగరం, ఇండోర్, సూరత్ ల టీమ్ లో ఉంది.
ఎకానమీలో ఇండోర్, ఆగ్రాల తర్వాత తిరుపతికే చోటు దక్కింది.
కేంద్ర ప్రభుత్వం దేశంలోని పట్టణాభివృద్ధి, పట్టణపాలనలకు సంబంధించి పలుఅంశాలను పరిశీలించి స్మార్ట సిటీ (Smart Cities 2020) లను ఎంపిక చేసి, వాటి జాబితాను విడుదల చేసింది. పట్టణ సంపూర్ణ పరిపాలనకు సంబంధించి ఇండోర్ (మధ్య ప్రదేశ్) సూరత్ (గుజరాత్ ) లో ఉత్తమ నగరాలుగా ఎంపికయ్యాయి.
సూరత్, ఇండోర్, అహ్మదాబాద్, పుణే, విజయవాడ, విశాఖ పట్టణం, పింప్రి-చించ్వాడా, వదోదర లకు కైమేట్ స్మార్ట్ సిటీ అసెస్ మెంటు ఫ్రేమ్ వర్క్ లో 4 స్టా ర్ గుర్తింపు వచ్చింది.
కేంద్ర పట్టణవ్యవహారాల శాఖ ఇండియన్ స్మార్ట్ సిటీస్ అవార్డు(ISAC)కోసం పట్టణాల మధ్య పోటీ పెడుతుంది.
ఇందులో పట్టణ పరిపాలనలో చూపిస్తున్న కొత్తదనం (innovation), దాని ప్రభావం (impact),ఇది మరొక చోట అచరించేందుకు వీలుంటుదా (replicability/scalability) అధారంగా ISAC పట్టణాలకు హోదా నిచ్చి రివార్డు లందిస్తుంది.
తిరుపతికి సంబంధించి శానిటేషన్ లో మొదటిస్థానం లభించింది. తిరుపతిలో బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించింది.నగరంలో జనాభాకు అవసరమయిన మరుగుదొడ్లు నిర్మూలించడం, వ్యర్థ నీరు శుద్ధి చేయడం, ఘన వ్యర్థ పదార్థాల నిర్మూలనలో ప్రశంలందుకుంది.ఇళ్ల నుంచి,వ్యాపార సముదాయలనుంచి వెలువడే చెత్తసేకరించి, దానిని పర్యావరణానుకూల పద్ధతిలో నిర్మూలించడంలో తిరుపతి ముందుంది.
సోషల్ యాస్సెక్టస్స్ (Social aspects) అంటే నగరంలోని పిల్లలకు పాఠశాలల ద్వారా విద్యావకాశాలను కల్పించే విషయంలో కూడా తిరుపతి మునిసిపల్ కార్పేరేషన్ ప్రశంసలందుకుంది. తిరుపతి తనదైన గుర్తింపు నిలబెట్టుకోవడంలో కొంత పుంతలు తొక్కింది. దేశంలో ఇండోర్, సూరత్ తర్వాత 5 అవార్డులు దక్కించుకున్న పట్టణం తిరుపతియే.