TPCC అధ్యక్షుడి నియామకం మరింత జాప్యం

న్యూఢిల్లీ: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం జాప్యం అయ్యే అవకాశం ఉంది. పత్రికల్లో, సోషల్ మీడియాలో రాస్తున్నట్లు  ‘అధ్యక్షుడి నియామకం పూర్తయింది, ఏ క్షణాన్నైనా ప్రకటన వస్తుంది’ అనేది ఊహాగానం మాత్రమే.

రేవంత్ రెడ్డిని గాని, మరొకరిని గాని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమిస్తూ నిర్ణయం ఇంకా తీసుకోలేదు అని ఎఐసిసికి వర్గాలు ‘ట్రెండింగ్ తెలుగు న్యూస్’ ప్రతినిధికి తెలిపాయి.

పార్టీ హైకమాండ్ కు తెలంగాణ అధ్యక్షుడిని నియమించడం అత్యవసరం కాదు అని ఈ వర్గాలు తెలిపాయి.

అయితే, ఈ నియామకం గురించి పార్టీలో చర్చ జరుగుతూ ఉందని, పార్టీ నేతల నుంచి అభిప్రాయ సేకరణ జరుగుతూ ఉందని చెబుతూ టిపిసిసి అధ్యక్షుడి నియామకం మరికొంత జాప్యం అవుతుందని ఈ వర్గాలు తెలిపాయి. ఈ వర్గాలు ఏకాభిప్రాయానికి వస్తే, నియామకం జరుగుతుంది. అదంత సులభంకాదు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఏ నాయకుడిని అసంతృప్తికి గురిచేసే స్థితిలో ఇపుడు లేదు.

కాంగ్రెస్ హైకమాండ్ లో ఇపుడు రెండు రాష్ట్రాలు ప్రధానంగా చర్చల్లో ఉన్నాయి. ఇందులో ఒకటి, పంజాబ్, రెండోది రాజస్థాన్. ఈ రెండు రాష్ట్రాలకు జరిగెే ఎన్నికల్లో పార్టీని కాపాడుకోవాలి. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు  2022 ఫ్రిబ్రవరిలో ఉన్నాయి. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు 2023 డిసెంబర్ లో ఉన్నాయి.  ఈ రెండు రాష్ట్రాలలో ఇపుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయితే, రెండు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ లో ముఠా తాగాదాలు తీవ్రంగా ఉన్నాయి. ఇవి పార్టీని దెబ్బతీసే స్థాయిలో ఉన్నాయి. బిజెపి ఈ తగాదాలను ఉపయోగించుకుని కాంగ్రెస్ దెబ్బతీయాలని చూస్తుననది. వాటిని చల్చార్చడమెట్లా అని పార్టీ నాయకత్వం తలపట్టుకుని కూర్చుంది.

అందువల్ల ప్రస్తుతానికి తెలంగాణ ప్రయారిటీ కాదని ఈ వర్గాలు తెలిపాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *